వాఘాలో ఆలియా.. ఖాకీ ప్యాంటు వేసింది!

Update: 2016-08-15 14:12 GMT

దేశ‌వ్యాప్తంగా 70వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా అతారి-వాఘా స‌రిహ‌ద్దు వద్ద రెండు దేశాల సైనికులు సంబ‌రాలు చేసుకున్నారు. బీఎస్ ఎఫ్ జ‌వాన్లు - పాకిస్థాన్ రేంజ‌ర్లు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఈ సమయంలో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా భారత్  - పాకిస్థాన్ సరిహద్దు అయిన వాఘాలో సందడి చేశారు. తన తల్లితో కలిసి వాఘాను సందర్శించిన ఆలియా.. సైనికులతో కలిసి వాలీబాల్ ఆడి అనంతరం గుర్రపుస్వారీ కూడా చేసింది.

ఈ క్రమంలో సైనికులతో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపిన ఆలియా.. వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఖాకీ ప్యాంటు - నల్ల రంగు జాకెట్‌ తో పాటు సైనిక బ్యాడ్జీలను ధరించి.. సైనికుల శిక్షణను - సాహసకృత్యాలను ఆసక్తిగా తిలకించింది.

కాగా వాఘా సరిహద్దు అనేది భారత్- పాకిస్తాన్ మధ్య లాహోర్ - అమృతసర్ నగరాల మధ్య ఉన్న ప్రదేశం. వాగా సరిహద్దులో 'బీటింగ్ ది రిట్రీట్' పెరేడ్ ప్రతిరోజూ సాయంత్రం చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడకు వచ్చే ప్రతి వారూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తారు. సూర్యాస్తమయ సమయానికి ఈ కార్యక్రమం ముగుస్తుంది.
Tags:    

Similar News