RRR సినిమా ద్వారా తన స్థాయిని మరో రేంజ్ కు పెంచుకున్న ఆలియాభట్ అంతకు ముందు వచ్చిన గంగుభాయ్ ఖతీయవాడి సినిమాతో కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మొదటిసారి ఒక వేశ్య పాత్రలో కనిపించింది. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన రియల్ లైఫ్ క్యారెక్టర్ గంగుభాయ్ పాత్రలో ఆమె నటించిన విధానం విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
అయితే ఆ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఉపయోగించుకుని ఇటీవల పాకిస్తాన్ రెస్టారెంట్ డిజైన్ చేసిన యాడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ కమర్షియల్ ప్రకటనపై ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. గంగుభాయ్ ఖతీయవాడి సినిమాలో ఒక సన్నివేశంలో అలియా భట్ తన రూమ్ బయట నిలబడి వేశ్యగా దారిన పోయే వారిని పిలుచుకుంటూ ఉంటుంది.
ఆ సన్నివేశం మొత్తం సినిమా లోనే చాలా హైలెట్ గా నిలిచింది. అంతే కాకుండా చాలా ఎమోషనల్ గా కూడా అనిపించింది అని కొంతమంది సినీ ప్రముఖులు స్పందించారు.
వేశ్య పాత్రను చాలా ఎమోషనల్ గా హైలెట్ చేసిన అలియా క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ కామెంట్స్ అందుకుంది. అయితే అలాంటి సన్నివేశాన్ని ఉపయోగించుకుని ఇటీవల పాకిస్థాన్ కు చెందిన ఓ రెస్టారెంట్ ఒక ఆఫర్ ను ప్రకటిస్తూ ఆలియా భట్ ను హైలెట్ చేశారు.
సోమవారం రోజు పురుషులకు ప్రత్యేకంగా ఆఫర్ ఉంది అంటూ అలియా పిలుస్తున్నట్లు గా ఆ కమర్షియల్ యాడ్ ను చూపించారు. దీంతో ఇలాంటి పిచ్చి పనులు తప్ప మరో ఆలోచనలు రావా అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆ రెస్టారెంట్ యాజమాన్యం పై విరుచుకుపడుతున్నారు.
మరోసారి మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అంటూ.. ఈ విషయంలో మీకు తప్పకుండా సలహాలు కావాలి అంటే సోషల్ మీడియా లో చాలామంది ఉన్నారు అని చివాట్లు పెడుతున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారుతోంది.