ఈరోజు బాలీవుడ్ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' రిలీజ్ అవుతోంది. కరణ్ జోహార్ నిర్మాణంలో పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టైగర్ ష్రాఫ్ ఈ చిత్రంలో హీరో కాగా అనన్య పాండే.. తారా సుతారియాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్లు ఇద్దరికీ ఇది డెబ్యూ ఫిలిం.
ఈ సినిమా 2012 లో రిలీజ్ అయిన 'స్టూడెంట్ అఫ్ ది ఇయర్' సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఆ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ ధావన్.. సిద్ధార్థ్ మల్హోత్రా.. అలియా భట్ ముగ్గురూ ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో సీక్వెల్ ద్వారా ఎంట్రీ ఇస్తున్న అనన్య.. తారా లు కూడా అగ్రపథాన దూసుకుపోవడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక సినిమా విషయానికివస్తే ఇందులో పెద్దగా 'కంటెంట్' ఉందని ఎవరూ అనుకోవడం లేదు. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టుగా కథ కంటే బ్రాండెడ్ డ్రెస్సులు.. టైగర్ గారి జిమ్నాస్టిక్ డ్యాన్సులు.. ఫైట్లు.. హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శన..ఇవే ప్రధానం కానున్నాయి. ఈ సినిమా ప్రోమోలు చూసినవారు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా చెప్తే ఇది బాలీవుడ్ గ్లామర్ ఫార్మాట్ సినిమా అనుకోవాలి.
అలా అని ఈ సినిమాను తక్కువ అంచనా వేయడం ఎంత పొరపాటంటే 'కాంచన 3' ఫ్లాప్ అవుతుందని అంచనా వేసినట్టు. ఈ సినిమా కంటెంట్ 'అట్టట్ట' ఉన్నా.. రివ్యూయర్లు కసిగా ఎట్టెట్టో రేటింగ్ ఇచ్చినా.. ఇదేం సినిమా అంటూ తిట్టిపోసినా.. వాటికి సంబంధం లేకుండా 100 కోట్ల క్లబ్బు.. 200 కోట్ల క్లబ్బులోకి దూసుకుపోగల సత్తా ఈ సినిమాకు ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాల నుండి ప్రేక్షకులు ఎవరూ 'అవతార్' రేంజ్ సీన్లు ఎక్స్ పెక్ట్ చేయరు.. టైమ్ పాస్ అనుకొని చూసేస్తారు.. అవికాస్తా డూపర్ హిట్ అవుతాయి. మీరే చూస్తారుగా.. బాక్స్ ఆఫీస్ దగ్గర కరణ్ జోహార్ నియాన్ కలర్ డ్రెస్సుల పండగ!