మెగాస్టార్ తర్వాత స్టైలిష్ స్టారేనట!

Update: 2018-08-30 11:17 GMT
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ 'సైరా' కు సురేందర్ రెడ్డి దర్శకుడు.  'తని ఒరువన్ రీమేక్ 'ధృవ' ను తెరకెక్కించి మెగాపపర్ స్టార్ రామ్ చరణ్ ను హిట్ బాట పట్టించడంతో వెంటనే మెగాస్టార్ తో సినిమాచేసే అవకాశం లభించింది.  రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాత అనే విషయం తెలిసిందే. ఇలా మెగా ఫ్యామిలీ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్న సూరికి మరో మెగా అవకాశం లభించిందట.

'సైరా' తర్వాత సురేందర్ రెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రిపరేషన్స్ సాగుతున్నాయట.   సూరి-బన్నీ ల కాంబినేషన్ లో తెరకెక్కిన 'రేసుగుర్రం' గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.  నాలుగేళ్ళ క్రితమే అది రూ. 60 కోట్ల షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది.  అప్పటి నుండి 'రేసుగుర్రం' కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.  'రేసుగుర్రం' సినిమాకు సీక్వెల్ గా అ సినిమా ఉండొచ్చని కూడా అన్నారు.  తాజా సమాచారం ప్రకారం సూరి-బన్నీ ల కాంబో మాత్రం  ఫైనల్ అయిందట కానీ అది సీక్వెలా కదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

ఇక మెగా క్యాంపు లో టాప్ హీరోల తో వరసగా సురెందర్ రెడ్డికి మూడో సినిమా అవుతుంది.  చెర్రీ - చిరు- బన్నీ లను వరసగా డైరెక్ట్ చేసే అవకాశం రావడం అంటే జాక్ పాట్ అనుకోవచ్చు. మరి 'సైరా' కనుక బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిస్తే సూరి-బన్నీ సినిమా క్రేజ్ ఆకాశాన్ని తాకుతుందనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News