ఆ ప్రాణం నిలవడంలో బన్నీ పాత్ర

Update: 2016-11-05 10:17 GMT
అప్పుడే లోకం చూసిన చిన్నారికి ప్రాణం పోయే లోపం ఉందని తెలిస్తే తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. ఆ లోపాన్ని సరి చేయడానికి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చినపుడు.. అంత మొత్తాన్ని భరించే శక్తి తమకు లేనపుడు ఇక తల్లిదండ్రుల బాధను ఎలా చెప్పాలి. భీమవరం ప్రాంతానికి చెందిన నాగరాజు.. దుర్గా ప్రశాంతి దంపతులు ఇలాంటి బాధనే అనుభవిస్తూ వస్తున్నారు నాలుగు నెలలుగా. వీరికి గత జూన్లో అబ్బాయి పుట్టాడు. ఐతే బిడ్డ పుట్టిన ఆనందం కాసేపటికే ఆవిరైంది. ఆ చిన్నారికి పెద్ద లోపం ఉందని చెప్పారు వైద్యులు. కాలేయం నుంచి క్లోమరసం స్రవించే నాళం మూసుకుపోయిందని పరీక్షల్లో తేలింది.

దీంతో కాలేయం మార్చాల్సిందే అని వైద్యులు తేల్చి చెప్పారు. ఐతే తన కాలేయంలో కొంత భాగం ఇవ్వడానికి తండ్రి నాగరాజు ముందుకొచ్చినా.. ఆ శస్త్రచికిత్స చేయడానికి భారీ ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆ మొత్తం రూ.30 లక్షలకు పైనే అని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఐతే వైద్యులు.. తెలిసిన వాళ్ల సహకారంతో సీఎం... పీఎం రిలీఫ్ ఫండ్స్ రెండింటి కోసం అప్లై చేశాడు. అదృష్టం కొద్దీ పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.13 లక్షలు.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు మంజూరైంది. అయినప్పటికీ ఇంకా డబ్బు అవసరం కాగా.. ఈ విషయం తెలుసుకున్న హీరో అల్లు అర్జున్ రూ.8 లక్షలు తన వంతుగా సాయం చేశాడు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యంగా ఉన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News