ఇద్దరమ్మాయిలతో సినిమా ఫ్లాప్ అయితే అయింది గానీ తర్వాత వచ్చిన రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల విజయంతో ఆ పరాజయాలన్నీ పక్కకు తప్పుకున్నాయి. ఈ రెండు సినిమాలు 50 కోట్ల మార్క్ ని అందుకున్నాయన్నది తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వున్నా బన్నీ మరో సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నాడు. బాగా లేటవుతోందే.. అనేలోపు పరుగు మొదలయింది అన్న ముచ్చట చెప్పేశాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా షూటింగ్ నేడే ఆరంభమయింది అంటూ సోషల్ మీడియాలో బన్నీ విషయాన్ని చెప్పాడు.
ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. బన్నీ విజయాలను దృష్టిలో పెట్టుకున్న తండ్రి, ఈ సినిమా నిర్మాత అల్లు అరవింది బోయపాటి కథకు తుది రూపు ఇచ్చేందుకు ఎన్నో కసరత్తులే చేయించారుట. మరో విశేషమేమిటంటే బద్రీనాథ్ తర్వాత మెగా ప్రొడ్యూసర్ నేరుగా నిర్మిస్తున్న సినిమా ఇదే. బోయపాటి కూడా ఈ సినిమాతో యూత్ ఫుల్ తీయగాలని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట. ఇదిలా వుంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన రకుల్ ప్రస్తుతం బన్నీ బావ చరణ్ తో ఆడిపాడుతోంది.