వైఫ్ అఫ్ స్టైలిష్ స్టార్ వన్ మిలియన్ రికార్డు

Update: 2018-10-08 06:22 GMT
ఈ కాలంలో అందరూ అంతర్జాలానికి అడిక్ట్ అయిన వాళ్ళే .. ఇంటర్నెట్ లేకుండా కాఫీ.. టీ కూడా తాగలేం.   కాఫీ తాగేందుకు ఇంటర్నెట్ ఎందుకు.. ఒక గ్లాసు అందులో కాఫీ ఉంటే సరిపోతుంది కదా అనే మీరు అమాయకంగా అడిగితే మీరు సత్తెకాలం సత్తెయ్య లా ఉన్నారని పక్కనోళ్ళు అనుకునే ప్రమాదం ఉంది.  ఏ వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకుంటూనే.. ఎవడో వేలు విడిచిన మేనమామ కొడుక్కి కాళ్ళు కడిగినాయన తమ్ముడు మీకు ఎప్పుడో లైక్ కొట్టారని దాన్ని చెల్లుకు చెల్లు చేసేందుకు మీరు ఫేస్  బుక్ లో లైక్ కొట్టడానికోసమో ఇంటర్నెట్ వాడడం కామన్ అయింది.   

గజిబిజిగా అనిపించిన సెంటెన్సు కదా. లెంగ్త్  ఎక్కువైంది కదా. అందుకే డైరెక్ట్ గా స్టైలిష్ స్టార్ టాపిక్ లోకి వెళ్దాం.  మొదట వైఫ్ అఫ్ స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్. ట్విట్టర్ తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లో తరచుగా పోస్ట్ లు పెడుతూ అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. దీంతో ఫాలోయర్స్ కూడా ఎక్కువే.  తాజాగా ఇన్స్టాగ్రామ్ లో స్నేహ ఫాలోయర్స్ సంఖ్య వన్ మిలియన్ కు చేరింది. ఇదేమీ చెప్పినంత ఈజీ కాదు.  బాలీవుడ్  హీరో షాహిద్ కపూర్ కీ బీబీ మీరా కు మాత్రమే ఇలా వన్ మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.

మీరా రాజ్ పుత్ తర్వాత సెలబ్రిటీల భార్యలలో వన్ మిలియన్ ఫాలోయర్ మార్క్ టచ్ చేసిన ఘనత మిసెస్ అల్లు అర్జున్ దే.  బన్నీ ఇప్పటికే యూట్యూబ్ లో వ్యూస్ తో భారీ రికార్డులు సృష్టిస్తున్నాడు.  రీసెంట్ గా బన్నీ కూడా ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోయర్స్ ను సాధించాడు.  అల్లు అర్జున్ కు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా డబ్బింగ్ సినిమాల ద్వారా భారీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇలాంటి ఫీట్ సాధించడం వీలయింది.  స్నేహ వన్ మిలియన్ అంటే బన్నీ 2 మిలియన్ అంటున్నారు.  భార్యాభార్తలు పోటీ పడి మరీ ఫాలోయర్లను పెంచుకుని రికార్డులు సృష్టిస్తున్నారు.  ఏం చేస్తాం.. అల్లు వారికి రికార్డులు కామనే కదా అని సరిపెట్టుకుందాం.


Tags:    

Similar News