ఆడిషన్ సిడి చూసి ఏమన్నారంటే...

Update: 2016-12-06 04:38 GMT

అసలు అప్పటివరకు రామ్ చరణ్‌ యాక్టర్ అవుతాడో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. కాని అందరూ మనోడు యాక్టింగ్ సైడ్ ఇంట్రస్ట్ చూపించి మెగాస్టార్ లెగసీ కంటిన్యూ చేస్తాడని మాత్రం అనుకున్నారు. ఇక సడన్ గా ముంబయ్ వెళ్ళి ఒక ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యి యాక్టింగ్ లో శిక్షణ పొందాడు చెర్రీ. ఆ తరువాత మనోడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడంటే..

''ముంబయ్ నుండి వచ్చిన వెంటనే ఒక డివిడి ఇచ్చాడు. అది తన ఆడిషన్ సిడి. ఒకరోజు చిరంజీవిగారు ఆ సిడి నేను చేస్తున్నా.. మీరు రండి అని పిలిచారు. అ సిడిలో తన స్కిల్ చూసినప్పుడు అనిపించింది.  అయిపోయాడు.. చరణ్‌ మాంచి యాక్టర్ అయిపోయాడు.. ఇక స్టార్ అవుతాడు అనుకున్నా'' అంటూ వివరించారు అల్లు అరవింద్. రామ్ చరణ్‌ ఆడిషన్ సిడి చూశాకనే ఇక చరణ్‌ కోసం కథలు వెతకటం మొదలెట్టారట.

అయితే అప్పట్లో చిరంజీవి డ్యాన్స్ మాష్టర్ లారెన్స్ ను కూడా ఇదే విధంగా చరణ్‌ కు డ్యాన్స్ కాస్త నేర్పించి.. సినిమాల్లోకి పనికొస్తాడా అని అడిగారట. ఆ విషయం అప్పట్లో లారెన్స్ రివీల్ చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు చరణ్‌ ఒక హ్యాపెనింగ్ స్టార్. సరైన కథలు ఎంపిక చేసుకోకుండా 40 కోట్ల రేంజ్ ఫ్లాపుల్లో మునిగిపోయాడు. కాకపోతే ఇప్పుడు ''ధృవ'' సినిమాతో మాత్రం రూటు మార్చేశేలా ఉన్నాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News