అల్లు అరవింద్ అక్కడకూడా అడ్డుకున్నాడా?

Update: 2016-12-07 04:25 GMT
ఒక సినిమాను విజయవంతంగా నిర్మించడమేకాక విజయవంతంగా విడుదల చెయ్యడంలో కూడా నిర్మాత ప్రతిభ దాగుంది. తాము తెరకెక్కించే స్టార్ క్యాస్టింగ్ సినిమాలకు ఎటువంటి ఇబ్బందీ, పోటీ లేకుండా అధిక సంఖ్యలో థియేటర్లలో విడుదలైతే దాదాపు సగవిజయం సాధించినట్టే.

ఇప్పుడు ధ్రువ చిత్రాన్ని తెరకెక్కించిన అల్లు అరవింద్ అదే పనిలో వున్నాడు. ముందుగా ధృవతో పోటీగా తమిళ నటుడు సూర్య నటించిన సింగం 3 విడుదలకావాల్సివుంది. అయితే సైలెంట్ గా పావులు కదిపి దాన్ని ఒకవారం వెనక్కి జరిపాడు. దీంతో తెలుగు, తమిళనాట చరణ్ కి ఎదురులేకుండా పోయింది.

ఇక మరో ప్రధాన సమస్యగా మారిన బెంగళూరు థియేటర్ల సంఖ్యని కూడా దాదాపు అరవింద్ ఛేదించినట్టు తెలుస్తుంది. కన్నడనాట ఆరోజు విడుదల కావలిసిన 'సుందరంగ జాణ' అనే సినిమాని ఒక వారం వాయిదా వేయించినట్టు సమాచారం. ఈ సినిమా ఇక్కడ విజయం సాధించిన భలే భలే మగాడివోయ్ కి రీమేక్. ఈ రీమేక్ లో నటించిన గణేష్ ఫాలోయింగ్ వున్న హీరో కావడం, ఈ చిత్రానికి అరవింద్ ఒకానొక ప్రొడ్యూసర్ కావడం ఈ వాయిదాకి ప్రధాన కారణాలు. మొత్తానికి ధృవ సోలోగా బాక్స్ ఆఫీస్ మీదకు దాడిచెయ్యడానికి సిద్ధపడిందన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News