KBC 13 ప్రస్తుతం హిందీ బుల్లితెరపై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ చేస్తున్నారు. ఆయన శుక్రవారం ఎపిసోడ్ కౌన్ బనేగా కరోడ్ పతికి ఫరా ఖాన్ - దీపికా పదుకొనే అతిథులుగా విచ్చేశారు. సెలబ్రిటీలు ఇద్దరూ ప్రత్యేక కాజ్ కోసం డొనేషన్లు అడగడం హృదయాల్ని టచ్ చేసింది.
ఈ కార్యక్రమంలో తాను గెలిచిన డబ్బులు పిల్లల కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన వ్యాధి అయిన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) తో బాధపడుతున్న పిల్లల కోసం అందజేస్తామని కొరియోగ్రాఫర్ కం దర్శకురాలు ఫరాఖాన్ అన్నారు. రోగగ్రస్తులైన కిడ్స్ కోసం చాలా ఖరీదైన ఇంజెక్షన్ ను కొనుగోలు చేయనున్నట్లు ఫరా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ పిల్లల పరిస్థితి చూసి చలించిపోయారు. ఇలాంటి కాజ్ కోసం ద్రవ్య విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో సోనీ ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్ చేసిన కొత్త ప్రోమో వీడియోలో అమితాబ్ హిందీలో ``లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫరా అనారోగ్యంతో బాధపడుతున్న అయాంష్ అనే 17 నెలల చిన్నారి కోసం ఈ గేమ్ ని ఆడుతోంది`` అంటూ ప్రకటించగా... ఆ వీడియో తర్వాత ఆయన్ష్ తల్లి తన బిడ్డ పరిస్థితిని వివరించే వీడియో స్ట్రీమింగ్ అయ్యింది. ఎపిసోడ అహూతులను కంటతడి పెట్టించింది.
కన్నీటి పర్యంతమైన ఫరా ఖాన్ హిందీలో ``అయాన్ష్ రెండు సంవత్సరాల వయసులో ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ అయిన జోల్జెన్స్మా అనే ఔషధం తీసుకోవాల్సి ఉంటుంది. దాని ధర 16 కోట్లు. అది అతని ప్రాణాన్ని కాపాడుతుంది. మేము ఈ బిడ్డను కాపాడాలనుకుంటున్నాము సర్`` అని అన్నారు.
``నేను దీనిని చెప్పాలా వద్దా అని నాకు తెలియదు.. కానీ ఫరాకు నేను వ్యక్తిగతంగా కూడా సహకారం అందించాలనుకుంటున్నాను. ఆ మొత్తాన్ని నేను తర్వాత మీకు చెప్తాను. నేను ఇక్కడ చర్చించాలనుకోవడం లేదు`` అని అమితాబ్ ఈ సందర్భంగా చెప్పారు. బిగ్ బి అమితాబ్ ప్రేక్షకులు ముందుకు వచ్చి విరాళాల రూపంలో ఆ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు సహాయం చేయాలని కూడా కోరారు.