ఊరు ఊరంతా కలసి ఖైదీ నెం 150 చూసేశారు

Update: 2017-02-06 07:25 GMT
ఒకప్పుడు పెద్దలు చెప్పేవారు.. ఏదైనా మాయాబజార్ వంటి అద్భుతమైన సినిమా వచ్చినప్పుడు.. చాలాసార్లు ఊరు ఊరంతా ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్ళి సినిమాలు చూసేవారమని. ఇప్పుడు అలాంటి రోజులు లేవులే అనుకుంటుంటే.. అదిగో మెగాస్టార్ చిరంజీవిపై ఒక ఊరు ఊరంతా కలసి.. తమ ప్రేమను ఒకేసారి చాటుకున్నారు.

గుంటూరు జిల్లాలోని.. దాచేపల్లి మండలంలో.. తక్కెళ్ళపాడు అనే ఊరుంది. ఆ ఊరి జనాలకు సడన్ గా చిరంజీవి రీ-ఎంట్రీ సినిమాను చూడాలని అనిపించింది. అనుకున్నదే తరువాయి.. ఊరు ఊరంతా బండ్లు కట్టుకుని బయలుదేరారు. దగ్గర్లో ఉన్న నారాయణపురం అనే ఊళ్ళో.. ఒక ధియేటర్లో ఒక షో మొత్తం బుక్కింగ్ చేసుకున్నారు. అందరూ కలసి ఒకేసారి సినిమాను చూసేశారు. అసలు ఆ ఊళ్ళో అనేకమంది కులాల వారు మతాల వారు ఉన్నప్పటికీ.. అందరూ కూడా దాదాపు చిరంజీవి ఫ్యాన్సేనట. బహుశా ఒక హీరోపై అభిమానం అంటే ఇలా పరిధులు లేని ప్రేమగానే ఉంటుందేమో. ఈ సంఘటనే అందుకు సాక్ష్యం.

ఇకపోతే ఇప్పటికే కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో ఖైదీ నెం 150 సినిమా రోజూ ఏదో ఒక షో 'హౌస్ పడటం' అనేది మాత్రం పెద్ద విషయమే. బహుశా చిరంజీవిని చూడాలి అనే కోరికతో అభిమానులు అందరూ అలా ధియేటర్లకు తరలి వస్తున్నట్లున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News