'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' లో హీరోయిన్ గా నటిస్తున్న అనన్య పాండే బాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అయిన చుంకీ పాండే కూతురు అయిన అనన్య పాండే తన మొదటి సినిమాను టైగర్ ష్రాప్ తో కలిసి నటిస్తోంది. తన మొదటి సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకుండానే అనన్య మీడియాలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈమె బాలీవుడ్ కుర్ర హీరో వరుణ్ దావన్ పై మనసు పారేసుకుందట. ఆ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాను వరుణ్ దావన్ ను పిచ్చిగా ప్రేమిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనన్య.. బాలీవుడ్ స్టార్స్ లో నాకు వరుణ్ దావన్ అంటే చాలా ఇష్టం. అతడిలో నాకు ఎక్కువగా నచ్చే విషయం ఎనర్జీ - చాలా క్యూట్ గా ఉండటంతో పాటు - ఎప్పుడు చూసినా కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఇద్ది చెప్పడం పద్దతి కాదు అయినా చెబుతున్నాను, ఏంటీ అంటే నాకు వరుణ్ అంటే చెప్పలేనంత ప్రేమ, ఈ జనరేషన్ హీరోల్లో ఆయన్ను ఎక్కువగా అభిమానిస్తాను అంది. అయినా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉండే అతడంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంటూ తన ప్రేమను ఒలకబోసింది.
ఇక బాలీవుడ్ స్టార్ దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ అంటే కూడా తనకు అభిమానం అని, జోయా అక్తర్ సినిమాలు అంటే ఇష్టం అని చెప్పిన అనన్య సంజయ్ లీలా భన్సాలీ వెండి తెర మెజీషియన్ అంటూ పేర్కొంది. ఆయన తీసిన దేవదాస్ చిత్రంను ఎప్పటికి మర్చి పోలేను. అద్బుతంగా ఆ సినిమాను రూపొందించాడు. ఆయన దర్శకత్వంలో చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్న పాత్ర అయినా ఆయన సినిమాలో చేయాలని భావిస్తున్నాను అంది. ఇక హీరోయిన్స్ విషయంలో స్పందిస్తూ తనకు ఆలియా భట్, ప్రియాంక చోప్రా ఇద్దరు కూడా చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.