బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ హవా ఎక్కువే. అబ్బాయిలు మాత్రమే హీరోలు కావడం అనే కాన్సెప్ట్ లేదు. అమ్మాయిలు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. కొత్త హీరోయిన్లు ఎలా అయితే గ్లామర్ షో చేస్తారో అంతకంటే రెండాకులు ఎక్కువగా గ్లామరసం చిందిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. అలాంటి బాటలోనే ఉన్న ఒక బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే.. డాటర్ ఆఫ్ చుంకీ పాండే. ఆయన ఎవరు అని మీరడిగితే ఈమధ్యే రిలీజైన 'సాహో' లో విలన్. విలన్లు చాలా మంది ఉన్నారు కదా అని మరో ప్రశ్న అడిగితే.. వారందరిలోమెయిన్ విలన్.
సాహో సంగతి.. సాహో విలన్ సంగతి పక్కన పెట్టి అనన్య సంగతి మాట్లాడుకుందాం. అనన్యను బాలీవుడ్ నెపోటిజం పితామహుడు కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా తో బాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఆ సినిమా హిట్టా ఫ్లాపా అనే సంగతేమో కానీ అనన్యకు మంచి గుర్తింపే వచ్చింది. సినిమాలతో పాటుగా అనన్య మ్యాగజైన్ కవర్ పేజీలలో కూడా మెరుస్తోంది. తాజాగా గ్రేజియా ఇండియా మ్యాగజైన్ వారికోసం కత్తిలాంటి ఫోటో షూట్ చేసింది. గ్రేజియా సెప్టెంబర్ ఎడిషన్ కవర్ పేజిపై కనిపించడమే కాదు విభిన్నమైన దుస్తులు ధరించి మరెన్నో ఫోటోలకు పోజులిచ్చింది. మీరు పైన చూస్తున్న ఫోటో అందులో ఒకటి.
ఈ ఫోటోలో అనన్య నాటెడ్ బికినీ ధరించింది. అంటే ముడులు వేసుకున్న బికిని టాప్ దీంతో పాటుగా ఫ్లోరల్ డిజైన్ ఉండే జాకెట్ ను ఊరికే అలా వేసుకుంది. తడిగా ఉండే జుట్టు.. మెరుస్తున్న లిప్ స్టిక్.. ఐ మేకప్ తో చాలా అందంగా కనిపిస్తోంది. చేతికి వాచ్.. వేళ్ళకు రింగులు భలే సూటయ్యాయి. చేత్తో ఒక పువ్వును పట్టుకుని ఒక కంటికి అడ్డుగా పెట్టుకుంది. మరో కంటితో ఓరచూపు చూస్తోంది. ఈ ఫోటోకు గ్రేజియా మ్యాగజైన్ ఇన్స్టా ఖాతాలో 'స్కూల్ ఆఫ్ కూల్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కూల్ గా ఉండే కరణ్ జోహార్ స్కూల్ లో చదివే ఉంటుంది. అందుకే కూల్ గా అందాలను వడ్డించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 'పతి పత్ని ఔర్ వో' అనే చిత్రంలో నటిస్తోంది.