ప్రతి నటి ఆ పరిస్థితిని ఎదుర్కొన్న వారే

Update: 2019-01-03 12:23 GMT
టాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల సినీ పరిశ్రమలో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఉన్నదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మాటకు వస్తే ఒక్క సినిమా పరిశ్రమలోనే కాకుండా వివిధ రంగాల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉందనేది జగమెరిగిన సత్యం. ఏదైనా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వారి బలహీనతలను క్యాష్‌ చేసుకుని, వారిని వాడుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విషయమై కొన్నాళ్ల క్రితం శ్రీరెడ్డి పెద్ద ఉద్యమం చేసింది. కాని ఆమె చేసిన ఉద్యమం గాడి తప్పడంతో ఆమెకు మొదట సపోర్ట్‌ చేసిన వారు కాస్త ఆ తర్వాత తప్పుకున్నారు.

తాజాగా శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌ ఉద్యమం గురించి యాంకర్‌ జాన్సీ మాట్లాడుతూ... ఆమె చేసిన ఉద్యమం సరైనదే, కాని ఆమె మద్యలో గాడి తప్పింది. ఆ సమయంలో మాలాంటి వాళ్లం ఆమెకు మద్దతు తెలిపితే మాపై కూడా బురద జల్లేవారు. అందుకే ఆమెకు అప్పుడు మద్దతు తెలపకున్నా కూడా నేను, మంచు లక్ష్మి ఇంకా కొందరం కలిసి కాస్టింగ్‌ కౌచ్‌ నివారణ కోసం ఒక సెల్‌ ను ఏర్పాటు చేయించాం. ఎవరైనా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవంను ఎదుర్కొంటే వెంటనే ఫిర్యాదు ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం అంటూ చెప్పుకొచ్చింది.

ఎంతో మంది అమాయకులు కాస్టింగ్‌ కౌచ్‌ కు బలయ్యారు, కాని ప్రస్తుతం ఇండస్ట్రీలో తీసుకుంటున్న చర్యల వల్ల కాస్త కాస్టింగ్‌ కౌచ్‌ తగ్గిందని చెప్పగలనంది. ఇక ఇండస్ట్రీలో ప్రతి నటి కూడా ఏదో ఒక సమయంలో షేక్‌ హ్యాండ్‌ పేరుతో చేయి ఇచ్చి నలిగి పోయి ఉంటారని, షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన సమయంలో కొందరు ఆ దృష్టితో చూస్తూ పావుగంట పాటు పిసికేస్తూ ఉంటారు. అలా ఎంతో మంది హీరోయిన్స్‌ ఇబ్బంది పడ్డ సందర్బాలు నాకు తెలుసు. హీరోయిన్‌ అనగానే చిన్న చూపు చూసే వారు ఎంతో మంది ఉంటారు. వారంతా కూడా ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటున్నారని జాన్సీ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News