ఆస్కార్ 2022: ఆస్కార్ ప్రతిమ విలువ ఎంత? ఆసక్తికర విషయాలివీ

Update: 2022-03-29 03:30 GMT
శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ ఎంత విలువైందో.. నటీనటులకు 'ఆస్కార్' అవార్డ్ అంతే అమూల్యమైనది.  హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మక ఈ ఆస్కార్ అవార్డ్ దక్కితే ఇక వారి జన్మ ధన్యమైనట్టే భావిస్తారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో ఆదివారం ఈ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డులపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా వీక్షించే టెలివిజన్ ఈవెంట్లలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

1929 నుంచి హాలీవుడ్ లో 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డుల గురించి స్పెషల్ స్టోరీ

-ఆస్కార్ చరిత్రలోనే అత్యధిక ఎక్కువ అవార్డులు గెలుచుకుంది వాల్ట్ డిస్నీ. ఈయన యానిమేషన్ సినిమాల్లో తనదైన ముద్రవేసి 59 సార్లు నామినేట్ కాగా.. 22 సార్లు విజేతగా నిలిచారు.

-ఆస్కార్ అవార్డు ప్రతిమ బంగారం కాదు.. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారం పూత పూస్తారు. చూడడానికి అచ్చం బంగారంలానే కనిపిస్తుంది.

-50 ఆస్కార్ ప్రతిమల తయారీకి మూడు నెలల సమయం పడుతుంది. దీని విలువ కేవలం ఒక అమెరికా డాలర్ మాత్రమే అంటే ఎవ్వరూ నమ్మరు.

-ఆస్కార్ అవార్డు గ్రహీతలు దాన్ని అమ్మడానికి వీల్లేదు. గెలిచిన వారు కాంట్రాక్టుపై సంతకం చేయాలి. అకాడమీని సంప్రదించకుండా ఈ అవార్డును అమ్మకూడదు.

-1953 మార్చి 19న బ్లాక్ అండ్ వైట్ టీవీలో తొలిసారి ఈ వేడుకలు ప్రసారం అయ్యాయి.

-మరణించిన తర్వాత ఆస్కార్ పొందింది ఇద్దరు కళాకారులు మాత్రమే.  బ్రిటన్ నటుడు పీటర్ ఫించ్, ఆస్ట్రేలియన్ హీత్ లెడ్జర్ కు ఈ అవార్డులు దక్కాయి.

-బెన్ హర్, టైటానిక్, దిలార్డ్ ఆఫ్ ది రింగ్స్, సినిమాలు 11 చొప్పున ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు.

-ఇప్పటివరకూ ముగ్గురు మహిళలు బెస్ట్ డైరెక్షన్ అవార్డులు గెలుచుకున్నారు.

-నాన్ ఇంగ్లీష్ సినిమా కేటగిరిలో అత్యధిక సార్లు అవార్డు గెలుచుకున్న దేశం ఇటలీ. ఇప్పటివరకూ 14 సార్లు ఈ అవార్డు అందుకున్నారు.

-అమెరికాకు చెందిన కేథరీన్ హాప్ బర్న్ నాలుగుసార్లు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గెలుచుకుంది.

అమెరికా నటుడు జాక్ నికోల్ సన్ , యూకేకు చెందిన డేనియల్ డే లూయిస్ ఇద్దరూ చెరో 3 సార్లు ఈ అవార్డు గెలుపొందారు.

ఇక ఈ సంవత్సరం 2022లో ఉత్తమ చిత్రంగా కోడా నిలిచింది. ఉత్తమ నటుడుగా విల్ స్మిత్ 'కింగ్ రిచర్డ్' చిత్రానికి ఎంపికయ్యాడు.  ఉత్తమ నటిగా జెస్సికా చాస్టెయిన్ నిలిచింది.  ఉత్తమ దర్శకుడు జాన్ కాంపియన్. 
Tags:    

Similar News