తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా - అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ థియేటర్లలోకి దిగిపోయింది. అర్ధరాత్రి నుంచే ప్రిమియర్లు - బెనిఫిట్ షోలు మొదలైపోయాయి. ఉదయం నుంచి రెగ్యులర్ షోలు పడుతున్నాయి. ఎప్పుడో 20 ఏళ్ల కిందట మొలకెత్తిన ఆలోచన.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద సినిమా. పరుచూరి సోదరుల దగ్గర మొదలైన ఈ ఆలోచన ఇంకో పదేళ్లకు చిరు దగ్గరికి వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చడానికి ఇంకో పదేళ్లు పట్టింది. చిరంజీవి అంతటి హీరోనే బడ్జెట్ విషయంలో భయపడి వెనక్కి తగ్గిన ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రామ్ చరణ్ టేకప్ చేశాడు. తండ్రి కల తీర్చాలని పంతం పట్టాడు. అతడికి సురేందర్ రెడ్డి తోడయ్యాడు. భారీ తారాగణం, ప్రపంచ స్థాయి టెక్నీషియన్ల అండతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సినిమాను ఓ దృశ్యకావ్యంలా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.
వీళ్ల కష్టానికి ఎలాంటి ఫలితం దక్కబోతోందో ఈ రోజు తేలిపోనుంది. ఈ చిత్రాన్ని చాలామంది ‘బాహుబలి’తో పోలుస్తున్నారు. చారిత్రక నేపథ్యం, భారీతనం, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ అలంకారాలు ఈ దిశగా ఆలోచించేలా చేస్తుండొచ్చు. ఐతే బాహుబలిని మ్యాచ్ చేయడం అంత చిన్న విషయం అయితే కాదు. ఆ స్థాయి హైప్ అనేది కూడా అసామాన్యమైన విషయం. అయితే ‘బాహుబలి’ని చేరుకోలేకపోయినా.. ‘బాహుబలి’ తర్వాతి స్థానంలో నిలవగలిగినా ‘సైరా’ది గొప్ప ఘనతే అవుతుంది. భారీ పెట్టుబడి పెట్టిన నిర్మాతలు, బయ్యర్లకు సంతోషం మిగల్చడం మీదే ‘సైరా’ స్థాయి ఏంటన్నది తెలుస్తుంది. అలా కాకుండా ‘సాహో’లా సినిమాలో ఏదో ఉందని భ్రమింపజేసి బయ్యర్లను జూదంలోకి దింపి నిండా ముంచేస్తే కష్టం. అలాంటి చెడ్డపేరు చిరు - చరణ్ తీసుకోకూడదన్నదే మెగా అభిమానుల ఆశ. మరి ఈ రోజు మధ్యాహ్నానికి సినిమాకు ఎలాంటి టాక్ - రివ్యూలు వస్తాయో.. సినిమా ఫలితంపై ఎలాంటి అంచనా వస్తుందో చూడాలి.