మరో అర్జున్ రెడ్డిని చూపిస్తున్న చైల్డ్ యాక్టర్

Update: 2023-02-16 09:47 GMT
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ జెనరేషన్ దేవదాసు ఎలా ఉంటాడు అనే పాయింట్ తో సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టారు. ఇదిలా ఉంటే ఆ సినిమా ప్రభావం ఈ జెనరేషన్ హీరోల మీద గట్టిగానే ఉంది అని చెప్పాలి. ఈ నేపధ్యంలో చైల్డ్ యాక్టర్ గా మెప్పించిన నటుడు దీపక్ సరోజ్. తరువాత లెజెండ్ సినిమాలో చిన్నప్పటి బాలకృష్ణ క్యారెక్టర్ లో కొద్దిసేపు కనిపించిన హీరోగా కచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ప్రశంసలు సొంతం చేసుకున్నాడు.

అతను హీరోగా మిణుగురులు అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి అవార్డులు వచ్చాయి. నటుడిగా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే హీరోగా అతని ఫేట్ ని మార్చలేదు. అయితే చాలా గ్యాప్ తీసుకొని మరల ప్రస్తుతం కంప్లీట్ మేకోవర్ లో సరికొత్త లుక్ తో దీపక్ సరోక్ సిద్ధార్ద్ రాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్, ఫస్ట్ లుక్ ని దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు.

చైల్డ్ యాక్టర్ గా చాలా సినిమాలలో నటించి మెప్పించిన దీపక్ సరోజ్ సరికొత్త లుక్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్న ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని హరీష్ శంకర్, అల్లు అరవింద్ ఆకాక్షించారు. ఇక ఈ సినిమాతో యువరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాదాన్ దీనికి సంగీతం అందిస్తూ ఉన్నాడు. అలాగే నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు.

అలాగే శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఉండటం విశేషం. భారీ బడ్జెట్ తో ని న్యూ ఏజ్ లవ్ గా దీనిని ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో నోట్లో రెండు సిగరెట్లు పెట్టుకొని ఒళ్ళంతా బ్లడ్ తో ఉండగా ఒక గులాబీ పువ్వు అతని ముందు ఉంది. దీనిని బట్టి ప్రేమకథా చిత్రంగానే ఈ మూవీ ఉండబోతుంది అని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాతో తనని తాను మాస్ అండ్ కమర్షియల్ హీరోగా దీపక్ సరోజ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. సమ్మర్ కానుకగా మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News