మీటూ వేదికగా దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తన పేరును పాయల్ ప్రస్థావించడంతో కథానాయిక రిచా చద్దా పరువు నష్టం దావా వేయడం సంచలనమైంది.
పాయల్ ఘోష్ తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోమవారం నాడు పంపిన లీగల్ నోటీసును డెలివరీ చేయడానికి నిరాకరించారని రిచా చద్దా పేర్కొన్నారు. నోటీసు హార్డ్ కాపీని చేతితో అందజేయడానికి తన న్యాయ బృందంలోని సభ్యులు పాయల్ ఘోష్ నివాసానికి వెళ్లారని ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఘోష్ దానిని అంగీకరించడానికి నిరాకరించారు. ఆ తరువాత వారు ఆమెకు ఒక సాఫ్ట్ కాపీని పంపారు.
రిచా మాట్లాడుతూ, “లీగల్ నోటీసు సాఫ్ట్ కాపీని మిస్ పాయల్ ఘోష్ కు పంపాం. నా వ్యక్తిగత న్యాయవాది కార్యాలయానికి చెందిన వ్యక్తితో కలిసి నోటీసు హార్డ్ కాపీని ఆమె నివాసానికి అందజేయడానికి వెళ్ళాడు. కానీ ఆమె (పాయల్) ప్రతినిధి అందుకునేందుకు నిరాకరించారు” అని తెలిపారు.