ప‌వ‌న్ డైరెక్ట‌ర్ చేతికి మ‌రో న‌వ‌ల

Update: 2022-03-29 02:30 GMT
ఫేమ‌స్ న‌వ‌ల‌ల ఆధారంగా అప్ప‌ట్లో టాలీవుడ్ లో చాలా చిత్రాలు తెర‌కెక్కాయి. సూప‌ర్ డూప‌ర్ హిట్ లు గా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాలా వ‌ర‌కు ఫేమ‌స్ న‌వ‌ల‌లు సినిమాలుగా రూపొంది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచాయి. అభిలాష‌, మ‌ర‌ణ మృదంగం, స్టూవ‌ర్ట్ పురం పోలీస్టేష‌న్ త‌దిత‌ర చిత్రాలు ఫేమ‌స్ న‌వ‌ల‌ల ఆధారంగా రూపొందిన‌వే. ఆ మ‌ధ్య విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన నితిన్‌ 'అఆ' కూడా ఫేమ‌స్ రైట‌ర్ యుద్ధ‌న‌పూడి సులోచ‌న‌రాణి న‌వ‌ల ఆధారంగా ఈ మూవీని రూపొందించార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఇదిలా వుంటే తాజాగా మ‌ళ్లీ న‌వ‌లా చిత్రాల ప‌రంప‌ర మొద‌ల‌వుతోంది. ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ విష‌యంలో అమితాస‌క్తిని చూపిస్తున్నారు. పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ఆయ‌న షెడ్యూల్ డిలే అవుతున్న నేప‌థ్యంలో పంజా వైష్ణ‌వ్ తేజ్ తో 'కొండ పొలం' చిత్రాన్ని రూపొందించిన విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ ఫేమ‌స్ న‌వ‌ల 'కొండ పొలం' ఆధారంగా అదే పేరుతో ఈ మూవీని రూపొందించారు.

తాజాగా ఆయ‌న క‌న్ను మ‌రో న‌వ‌ల‌పై ప‌డింది. మ‌ల్లాది వెంక‌ట‌కృష్ణ‌మూర్తి రాసిన '9 గంట‌లు' న‌వ‌ల హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారని తెలిసింది. అయితే ఈ న‌వ‌ల‌ని సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా చేస్తున్నార‌ట‌. దీనికి క్రిష్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. త‌న వ‌ద్ద ప‌లు చిత్రాల‌కు స‌హాయ‌కుడిగా వ‌ర్క్ చేసిన ఓ యువ‌కుడికి ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసే బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని తెలిసింది.

ఇప్ప‌టికే స‌గం వ‌ర్క్ పూర్త‌యింద‌ని చెబుతున్నారు. అయితే ముందు ఈ న‌వ‌ల‌ని సినిమాగానే తెర‌పైకి తీసుకురావాల‌నుకున్నార‌ట క్రిష్‌. కానీ ఇటీవ‌ల న‌వ‌ల ఆధారంగా చేసిన 'కొండ పొలం' ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో సినిమా క‌న్నా వెబ్ సిరీస్ బెట‌ర్ అని భావించి సిరీస్ గా నిర్మించ‌బోతున్నార‌ట‌.

'9 గంట‌లు' న‌వ‌ల‌తో పాటు మ‌రి కొన్ని న‌వ‌ల‌ల‌ని కూడా క్రిష్ సినిమాలు గానో లేక వెబ్ సిరీస్ లు గానో తెర‌పైకి తీసుకొచ్చే ఆలోచ‌న‌లో వున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త కొంత కాలంగా చిత్రీక‌ర‌ణకు బ్రేక్ ప‌డిన 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' తాజా షెడ్యూల్‌ షూటింగ్ త్వ‌రలోనే ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి భారీ సెట్ ల‌ని ప‌ద్మ‌శ్రీ తోట త‌ర‌ణి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News