విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో పాన్ ఇండియా చిత్రం?

Update: 2022-02-25 07:30 GMT
`అర్జున్ రెడ్డి` స‌క్సెస్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా లో పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమా ఒక్క తెలుగులోనే రిలీజ్ అయినా వివిధ భాష‌ల్లో `అర్జున్ రెడ్డి` రీమేక్ అవ్వ‌డం విజ‌య్ కి క‌లిసొచ్చింది. ఆ ఒక్క హిట్ బాలీవుడ్ అనూహ్య‌మైన గుర్తింపును తెచ్చి పెట్టింది.  స‌రిగ్గా ఇదే ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు పూరి రంగంలోకి దిగి `లైగ‌ర్` చిత్రాన్ని  తెలుగు.హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు.

అలా విజ‌య్ తొలి బాలీవుడ్ చిత్రంతో హిందీలో లాంచ్ అవుతున్నాడు. పూరికి బాలీవుడ్ లో కొద్దో గొప్ప ఇమేజ్ ఉంది. అమితాబ‌చ్చ‌న్ తో తెర‌కెక్కించిన `భుడ్డా..హోగా తెరా బాప్`...`బిజినెస్ మెన్` లాంటి చిత్రాల‌తో పూరికి  ఉత్తారిదిన ఓ ఇమేజ్  క్రియేట్ అయింది.

య‌శ్ రాజ్ ఫిలింస్ ద్వారా సినిమా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో పెద్ద ఎత్తున థియేట‌ర్లు దొరికే అవ‌కాశం ఉంది. `లైగ‌ర్` స‌క్సెస్ అయితే గ‌నుక ఆ ప్ర‌భావం విజ‌య్ త‌దుప‌రి చిత్రాల‌పై ఉంటుంది. ఈనేప‌థ్యంలో విజ‌య్ ప్లానింగ్ కూడా అన్ని ర‌కాలుగా వేసుకుని ముందుకు క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది.

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ చిత్రం క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈసినిమా సెట్స్ కు  వెళ్ల‌నుంది. ఇందులో హీరోయిన్ గా  బాలీవుడ్ భామ కియారా అద్వాణీని ఎంపిక చేసారు. తొలుత చిత్రాన్ని  కేవ‌లం తెలుగులోనే తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. కానీ తాజాగా ఈ కాంబో పాన్ ఇంటియా కేట‌గిరిలోనే సినిమా  తెర‌కెక్కించాల‌ని  భావిస్తున్నారుట‌.

తెలుగుతో పాటు..ఏక కాలంలో హిందీలో కూడా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.  మొత్తంగా చిత్రాన్ని  పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని ద్వ‌యం స‌న్నాహాకాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే కియారాకి భారీగా పారితోషిక ఆఫ‌ర్ చేసి ప్రాజెక్ట్ లోకి దించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. అయితే శివ ఎంపిక చేసుకున్న స్ర్కిప్ట్ ఎలాంటింది? అన్న‌ది  తెలియాల్సిన అంశం. గ‌తంలో ఆయ‌న ల‌వ్ స్టోరీ బ్యాక్ చిత్రాలే తెర‌కెక్కించి స‌క్సెస్ లు అందుకున్నారు. `ట‌క్ జ‌గ‌దీష్` మిన‌హా  `నిన్ను కోరి`..`మ‌జిలీ` చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ న‌మ్మ‌కంతోనే విజ‌య్ అవ‌కాశం ఇచ్చాడు.

ఇప్పుడా న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త విజ‌య్ పై ఉంది. అయితే పాన్ ఇండియా థాట్ అనేది విజ‌య్ ఐడియాగానే  వినిపిస్తోంది. `లైగ‌ర్` పై ఉన్న ధీమాతోనే ముందొస్తు ప్లాన్  లో భాగంగా  గా శివ‌ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్దం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. శివ మార్క్ ల‌వ్ స్టోరీ అనే ప్ర‌చారం సాగుతోంది. ల‌వ్ స్టోరీ అనేది యూనివ‌ర్శ‌ల్ కాబ‌ట్టి పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యేలా స‌బ్జె లో  కొద్ది పాటి మార్పులు చేసి తెర‌కెక్కిస్తే అన్ని ప్రాంతాల ప్రేక్ష‌కులు ఆదరిస్తారు అన్న న‌మ్మ‌కంతో మూవ్ అవుతున్నార‌నే సంకేతాలు అందుతున్నాయి. మ‌రి  అస‌లు క‌థ ఏంట‌న్న‌ది?  కొద్ది రోజులు ఆగితేగాని తెలియ‌దు. ఇటీవ‌లే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్య‌యి. అతి త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభం కానుంది.  

    

Tags:    

Similar News