టాలీవుడ్ లో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న అర్జున్ రెడ్డి సినిమాను హిందీ మరియు తమిళంలో ఒకే సారి రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. హిందీ అర్జున్ రెడ్డి 'కబీర్ సింగ్' ఇప్పటికే వచ్చి సూపర్ హిట్ సాధించి వెళ్లి పోగా అరవ అర్జున్ రెడ్డి మాత్రం ఇంకా వెనక్కు ముందుకు ఊగిసలాడుతూనే ఉంది. మొదట సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిన తర్వాత దర్శకుడిని మార్చి మొత్తం రీ షూట్ చేశారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల వాయిదాలు పడింది.
ఎట్టకేలకు అరవ అర్జున్ రెడ్డి 'ఆధిత్య వర్మ'ను నవంబర్ 8న అంటే మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అలాంటి సమయంలో ఈ సినిమాకు సెన్సార్ నుండి సమస్య వచ్చింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాను యూ/ఎ సర్టిఫికెట్ ఆశిస్తుంటే సెన్సార్ బోర్డు మాత్రం ఎ సర్టిఫికెట్ ఇచ్చిందట. మల్టీప్లెక్స్ లతో పాటు పలు థియేటర్లలో ఎ సర్టిఫికెట్ సినిమాలకు పిల్లలను రానివ్వరు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వరకు తగ్గుతారు.
అందుకే ఆదిత్య వర్మ'కు యూ/ఎ సర్టిఫికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లేందుకు కూడా యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే సినిమాను ప్రకటించిన తేదీకి అంటే ఎల్లుండి విడుదల చేయడం సాధ్యం కాదని తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆలస్యం అయినా పర్వాలేదు కాని ఆదిత్య వర్మను అందరికి చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా తమిళ నిర్మాతలు చెబుతున్నారట.
ఆదిత్య వర్మకు అర్జున్ రెడ్డి చిత్రానికి సహాయ దర్శకుడిగా వ్యవహరించిన గిరీశయ్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. తమిళ ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఆదిత్య వర్మ ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని విక్రమ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.