సెంటిమెంటు పరిశ్రమలో సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం అంటే గట్స్ ఉండాలి. ఈ గట్స్ విషయంలో ఇటీవల మన మేకర్స్, హీరోలను ప్రశంసించి తీరాలి. ఫ్లాప్ డైరెక్టర్ అని పక్కన పెట్టకుండా స్నేహం కోసం హీరోలు అవకాశాలిస్తున్నారు. రవితేజ, సాయిధరమ్, రామ్ లాంటి హీరోలు అయితే దర్శకులకు ఇచ్చిన కమిట్‌మెంట్ పై స్నేహం కోసం నిలబడి సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఫ్లాప్ దర్శకులకు అవకాశాలిస్తున్నాం అని భయపడే సన్నివేశం వీళ్లలో కనిపించడం లేదు. సెంటిమెంటు `స్టంటు` పరిశ్రమలో ఇదో కొత్త ట్రెండ్ అనే చెప్పాలి.
వరుస పరాజయాలతో అసాధారణ స్టార్ డమ్ ని కోల్పోయి హీరోల నుంచి తిరస్కారానికి గురైన పూరి జగన్నాథ్ కి రామ్ ఓ అవకాశం ఇచ్చాడు. అయితే సేమ్ సన్నివేశంలో ఉన్న రామ్ కి పూరి కూడా రిటర్న్ గిఫ్ట్ (ఛాన్స్) ఇచ్చాడనే చెప్పాలి. ఈ ఇద్దరూ ఫ్లాపుల్లో ఉండీ మరో ఫ్లాప్ హీరోయిన్ కి ఛాన్సివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్. ఇటీవలే `ఐస్మార్ట్ శంకర్` చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కాస్టింగ్ సెలక్షన్ పనిలో పూరి- ఛార్మి బృందం బిజీ బిజీగా ఉన్నారు.
అంతేకాదు రామ్ సరసన కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్ ని ఎంపిక చేసారని తెలుస్తోంది. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య లాంటి డిజాస్టర్లతో అను ఇమ్మాన్యుయేల్ ఒక్క సారిగా బ్యాక్ బెంచీకి పరిమితమైపోయింది. తనపై ప్రస్తుతం నెగెటివిటీ ప్రభావం తీవ్రంగానే ఉంది. అయితే దేనికీ పూరి, రామ్ భయపడలేదనే తాజా ఎంపికను బట్టి అర్థమవుతోంది. అనూపై ఐరెన్ లెగ్ అన్న టాక్ వినిపించినా వెరవక అవకాశం ఇచ్చారు. మొత్తానికి ఈ ఫ్లాప్ బ్యాచ్ అంతా కలిసి మరో ఫ్లాప్ బ్యూటీకి ఛాన్సివ్వడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా డేరింగ్ డెసిషన్స్ తో ఐస్మార్ట్ శంకర్ టీమ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రామ్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. ఈసారి పూరి టీమ్ ఏదో కొత్త మ్యాజిక్ చేస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.
Full View