చందమామ కథల హీరోయిన్ నేను!!

Update: 2017-05-05 10:55 GMT
చిన్నపుడు అందరూ కథలు పుస్తకాలు చదువుతారు. చదివినప్పుడు మనం ఆ కథలోని ప్రపంచంలో కాసేపు అలా విహరిస్తూ ఉంటాం. బేతాళ కథలు - మాయదీపం కథలు - రెక్కల గుర్రాలు - సముద్రపు జలపాతాలు - జలకన్యలు - పుష్పకవిమానాలు - మాంత్రికుడు మాయలు - రాజులు - కత్తి యుద్దాలు ఇలా అన్నీటిని ఊహించుకుంటాం. మరి అలాంటి పాత్రలో మనమే ఉంటే ఆ కిక్కే వేరే కదా.. అలాంటి కిక్ లోనే ఉన్నాను నేను ఉన్నాను అంటోంది దేవసేన అనుష్క.

“చిన్నప్పుడు ఎక్కువగా ఎవ్వరితో సరిగా మాట్లాడేదాన్ని కాదు. ఒక మూల కూర్చొని చందమామ కథలు సాహస వీరుల అద్భుత కథలు చదువుకునే దాన్ని. అవి చదువుతున్నపుడు నా కోసం రాజకుమారుడు వచ్చేవాడు. మరి నిజ జీవితం అలా వస్తాడో రాడో తెలియదు.. అప్పుడు అవి చాలా గమత్తుగా ఉండేవి. ఇప్పుడు నేను అలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడం నాకు మాత్రమే దక్కిన వరంగా భావిస్తున్నాను. నేను చేసిన అన్నీ సినిమాల్లోకి నా ఊహా ప్రపంచానికి దగ్గరగా ఉన్న సినిమా బాహుబలి'' అంటూ చెప్పుకొచ్చింది స్వీటి.

అనుష్క ఇప్పుడు బాహుబలి 2 సినిమా విజయం ఇచ్చిన ఆనందం తో పూర్తిగా అలా చిన్ననాటి కథల ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది. పెళ్లి కూడా కాలేదు మరి ఏ రాజకుమారుడు కోసమో అనుష్క నిరీక్షణ చేస్తుందో చూద్దాం. బాహుబలి నటీనటులు అందరికీ పెళ్లి పై గాలి మళ్ళినట్టుంది. ప్రభాస్ కి రానా కి ఇప్పుడు అనుష్కకి అందరికీ ఈ ఏడాదే పెళ్లి కావచ్చు.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News