పెళ్లిపై అనుష్క మరోమారు క్లారిటీ ఇచ్చింది

Update: 2020-02-22 06:00 GMT
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ప్రేమ.. పెళ్లి గురించి గత నాలుగు అయిదు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్‌ తో ఈమె ప్రేమలో ఉందని.. ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే పెళ్లి విషయమై అనుష్క గతంలో పలు సార్లు క్లారిటీగా తాను తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని చేసుకుంటాను.. ప్రేమ వివాహం చేసుకోను అంటూ చెప్పేసింది. అయినా కూడా వార్తలు మాత్రం ఆగలేదు.

ఇటీవల ఈమె ఒక క్రికెటర్‌ తో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఆ క్రికెటర్‌ తో ఈ అమ్మడికి ఇదే ఏడాది పెళ్లి అన్నారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కూడా కన్నడ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాంతో ఆ వార్తలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అనుష్క మరోసారి స్పందించింది. తన తల్లిదండ్రులు చూసిన వారినే పెళ్లి చేసుకుంటాను.. ప్రేమలో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చింది.

భాగమతి చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న అనుష్క నిశబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అనుష్క ఆ సినిమాలో మూగ చెవిటి అమ్మాయిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. సమ్మర్‌ లో నిశబ్దంతో అనుష్క ఎంటర్‌ టైన్‌ చేయబోతుంది. అనుష్క ప్రస్తుతం తెలుగులో మరో లేడీ ఓరియంటెడ్‌ చిత్రంకు గాను చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
Tags:    

Similar News