సరైన హిట్ సినిమాలు లేక బాలీవుడ్‌లో అనుష్కశర్మ కెరీర్ గత కొంతకాలంగా మందగమనంలో పడిపోయింది. ఇక హీరోయిన్‌గా ఆమె కెరీర్ ఏమవుతుందో అని అందరూ అనుకొంటున్న తరుణంలో అనుష్క సొంతంగా నిర్మాతగా మారింది. ఎన్‌హెచ్10 అనే సినిమాను నిర్మించింది.
ఇప్పుడు అది ఆమెకు మంచి ఫలితాలనే ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. తనే ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాతో ఆమె నిర్మాతగా మంచి లాభాలను గడిస్తోందని సమాచారం. సగటు బాలీవుడ్ సినిమా స్థాయి బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఇప్పుడు మంచి వసూళ్లు దక్కుతున్నాయి.
పాజిటివ్ రివ్యూలు.. మౌత్‌టాక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు అని ట్రేడ్ ఎనలిస్టులంటున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా దాదాపు 20 కోట్లరూపాయల వరకూ వసూళ్లను సాధించిందని సమాచారం.
ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్లు రెట్టింపు స్థాయికి రీచ్ అయ్యాయని తెలుస్తోంది. మరి మొత్తానికి అనుష్క టైమ్ బాగున్నట్టుగానే ఉంది!