ఇన్‌ సెక్యూరిటీని వ‌దిలేయండి -అనుష్క

Update: 2015-11-02 05:39 GMT
సైజ్ జీరో సినిమాలో బొద్దుగా గుమ్మ‌డి కాయ ఆకారంలో క‌నిపించ‌బోతోంది స్వీటీ. అయితే ఇలాంటి రూపం ఉన్న‌వాళ్లంతా ఇన్‌ సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతోంది స్వీటీ. ఆ ఇన్‌ సెక్యూరిటీ నుంచి బైట‌ప‌డేసే సినిమా సైజ్ జీరో అని ప్ర‌చారం చేస్తోంది. నిన్న‌టిరోజున‌ సైజ్ జీరో ఆడియో వేడుక హైద‌రాబాద్ హైటెక్స్‌ లో గ్రాండ్‌ గా జ‌రిగింది.. ఈ వేడుక‌లో స్వీటీ ఏం చెప్పిందంటే...

''సైజ్‌ జీరో స్క్రిప్టు విన్నప్పుడు క‌థానాయిక అన్న విష‌యాన్ని మ‌ర్చిపోయి.. ఓ మామూలు అమ్మాయిగా బాగా కనెక్టయిపోయా. స్వీటీగా నార్మల్‌ లైఫ్ కి కనెక్టయిపోయాను. నా 10 ఏళ్ల కెరీర్‌ లో ఎన్నో సార్లు బరువు పెరిగాను. తగ్గాను. బరువు పెరిగినప్పుడల్లా ఇన్‌ సెక్యూరిటీ ఉంటుంది.. ఎందుకంటే మ్యాగజైన్లు, పత్రికల్లో చూసిన జనాలు ఎగ్జాక్ట్‌ గా అలా కనిపించకపోతే ఊరుకోరు. అందుకని ఎంతో జాగ్రత్త తీసుకునేదానిని. ఈ చిత్రంలో చక్కని సందేశం ఉంది. సైజ్‌ గురించి, కలర్‌ గురించి ఇన్‌ సెక్యూరిటీ వదిలేయాలి అన్న సందేశం ఉంది. అయితే ప్రతి ఒక్కరూ ఎక్సర్‌ సైజులు చేయాలి. అది ఆరోగ్యానికి మంచింది'' అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.

''తెలుగు, తమిళ్‌ ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యే చిత్రమిది. నిర్మాత పివిపి గారికి ఈ స్క్రిప్టు నచ్చి చేయడం చాలా సంతోషం. ప్ర‌కాష్ కోవెల‌మూడి భార్య కనిక చెప్పిన కథని తర్వాతి లెవల్‌ కి తీసుకెళ్లడానికి ప్రకాష్‌ గారు తపించిన తీరు ఇంట్రెస్టింగ్‌. ఈరోజుల్లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా తీయడం అంటే ఆషామాషీ కాదు. బోలెడంత శ్రమ, ఖర్చు ఉంటుంది. అయినా ఈ ప్రయత్నం చేశారు'' అంటూ తన నిర్మాతను పొగిడేసింది. మొత్తానికి అనుష్క మాంచి ఎగ్జయిటెడ్‌ గా ఉంది. లెటజ్‌ సీ.

Tags:    

Similar News