తమిళనాట రగులుతున్న చిన్న ఉద్యమంకూడా నేడు పెను మార్పులకు కారణమయ్యే అవకాశాలు వున్నాయి. జల్లికట్టుని తమిళతంబీలు గెలుచుకున్న తీరు అందరినీ మెప్పించడమేకాక అదే పంధాలో ఉద్యమాలకు దారితీస్తుంది. ఇప్పుడు కొత్తగా కూల్ డ్రింక్ ల బ్యాన్ గురించి తమిళనాట చర్చంతా.
అనారోగ్యానికి కారణమయ్యే శీతల పానీయాలను నిషేదించాలని ఇప్పటికే చాలా సార్లు ధర్నాలు చేశారు. అయితే మార్పు మనలో రావాలని తెలుసుకుని స్వతహాగా ప్రతీఒక్కరూ ఈ పానీయ స్వీకరణని విరమించుకోవాలని డిసైడ్ అవుతున్నారు. చిన్నగా మొదలైన పరిణామమే అయినా పెను మార్పుకు దారితీస్తున్నట్టు కనిపిస్తుంది.
ఈ విషయంపై స్టార్ డైరెక్టర్ మురగదాస్ స్పందించాడు. ఆయన మూడేళ్లుగా బహుళజాతి కంపెనీలకు సంబంధించిన శీతలపానీయాలను మానేసినట్టు తెలిపారు. కత్తి సినిమా రాసుకుంటున్న సమయంలోనే ఆకథను మనసుకి దగ్గర చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇకపై ఆయన షూటింగ్ స్పాట్ లో కూడా కూల్ డ్రింక్స్ కి అనుమతిలేదంట. విచిత్రమేమిటంటే మురుగ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ప్రతిష్టాత్మక శీతల పానీయ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండడం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/