నువ్వు కూడానా దాసూ!

Update: 2018-10-06 10:30 GMT
కాదేది కవితకనర్హం పాత నానుడి. సినిమా పరిశ్రమలో మాత్రం కవిత స్థానంలో కాపీ అనే పదం ఉంటుంది . అంతే తేడా. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ తన కథను కాపీ కొట్టి ఆఫీసర్ తీసాడని అతని టీమ్ లోనే ఒక మాజీ సభ్యుడు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అది డిజాస్టర్ కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ లేకపోతే పెద్ద రచ్చే అయ్యేది. ఇక అజ్ఞాతవాసి విషయంలో త్రివిక్రమ్ పడిన మాటలు అన్ని ఇన్ని కావు. ఏకంగా ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు ఆన్ లైన్ లో నిలదీసే దాకా వచ్చింది పరిస్థితి.

ఇప్పుడు మురుగదాస్ కూడా అదే దారిలో ఉన్నాడా అంటే ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. విజయ్ తో దాస్ తీస్తున్న సర్కార్ షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. కానీ ఈ లోపు వరుణ్ రాజేంద్రన్ అనే కథకుడు కం దర్శకుడు ఈ కథ తనదే అని సెంగోల్ పేరుతో 2007లోనే రిజిస్టర్ చేసానని సంఘంలో ఫిర్యాదు చేసాడు. దీంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది.

దీనికి తోడు నిన్న మురుగదాస్ తన ట్విట్టర్ ద్వారా సర్కార్ సినిమాకు పని చేసిన టీమ్ మెంబెర్స్ ఎవరైనా సరే జూనియర్ ఆర్టిస్టులతో సహా తమ అనుమతి లేకుండా ఇంటర్వ్యూలు లాంటివి ఇస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కాస్త ఘాటుగానే హెచ్చరించాడు. అంటే సర్కార్ కథ సెంగోల్ ని పోలి ఉందనే వార్త యూనిట్ లో ఒకరే వరుణ్ రాజేంద్రన్ కు చేరవేసారనే అనుమానమే దాస్ కు వచ్చిందా. ఏమో కావొచ్చు అంటోంది తమిళ మీడియా. ఇప్పుడు ఇది వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. దాస్ ఇది సెంగోల్ కథ కాదని రుజువు చేయాలంటే సంఘంలో  రిజిస్టర్ చేసిన సర్కార్ కథతో పోలికలు లేవని చూపాలి. మురుగదాస్ మాటలు చర్యలు మాత్రం అనుమానం రేపెలా ఉన్నాయి. విజయ్ లాంటి పెద్ద హీరో సినిమా కాబట్టి ఎక్కువ రచ్చ కాకుండా ఆపుతారో లేక తప్పు లేదని రుజువు చేస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News