హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ''అరణ్య''. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచిన మేకర్స్.. ఇటీవలే ట్రైలర్ మరియు 'వెళ్ళు వెళ్ళు' అనే సాంగ్ రిలీజ్ చేయగా మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'హృదయమే' అనే గీతాన్ని విడుదల చేశారు.
'హృదయమే జ్వలించేనే.. ప్రాణమే విడిచి పోయేనే..' అంటూ సాగే ఈ సోల్ ఫుల్ సాంగ్ కి శాంతను మోయిత్ర స్వరాలు సమకూర్చారు. 'నీలిమబ్బుని అడుగు నిజం తెలుపుతుంది.. పూలతీగనడుగు తావి తెలుపుతుంది.. చిన్ని మొగ్గనడుగు చిగురు తెలుపుతుంది' అంటూ అడవులు - ప్రకృతికి సంబంధించిన పదాలు వచ్చేలా లిరిసిస్ట్ వనమాలి సాహిత్యం అందించారు. ఈ గీతాన్ని హరి చరణ్ శేషాద్రి ఆలపించారు. హృదయం ద్రవింపచేసేలా ఉన్న ఈ 'హృదయమే' పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.
కాగా, తెలుగు తమిళ హిందీ భాషలలో రూపొందిన 'అరణ్య' చిత్రంలో తమిళ నటుడు విష్ణు విశాల్ - జోయా హుస్సేన్ - శ్రియ పిల్గావోంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. హిందీలో ‘హథీ మేరే సాథి’.. తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. పర్యావరణ సమస్యలు - అటవీ నిర్మూలన - జంతువుల సంరక్షణ వంటి అంశాలను చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పోకుట్టి సౌండ్ డిజైన్ చేయగా.. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు.
Full View