పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత ప్రతీ దర్శక హీరో కూడా ఇప్పుడు ఇతర భాషల్లో సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మాతృభాషలో పెద్దగా క్రేజ్ లేని వాళ్ళు కూడా బాలీవుడ్ లో పాగా వేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకటీ అర సినిమాలు చేసిన మేకర్స్ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాలకు నార్త్ మార్కెట్ కీలకం కాబట్టి ఇప్పుడు అందరూ బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగా అక్కడి నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ మేకర్స్ తో కొలాబరేట్ అవుతూ భారీ స్థాయిలో సినిమాలు తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే బాలీవుడ్ మోజులో కొందరు దర్శకులు టాలీవుడ్ లో కూడా క్రేజ్ పోగొట్టుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు భారతీయ సినిమాలో 'బాలీవుడ్' అతి పెద్ద ఇండస్ట్రీగా పరిగణించబడేది కాబట్టి.. ఫిలిం మేకర్స్ అంతా హిందీలో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరిచేవారు.
ఇప్పటికే అనేకమంది టాలీవుడ్ డైరెక్టర్స్ నేరుగా హిందీ సినిమాలు చేసి, బాలీవుడ్ లో అడుగుపెట్టారు. వారిలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్ అయ్యారు. కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి ఒకరిద్దరు దర్శకులు మాత్రమే అక్కడే స్థిరపడిపోయారు.
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల సందడి మొదలైన తర్వాత భాష ప్రాంతీయ హద్దులు చెరిగిపోయాయి. కంటెంట్ బాగుంటే ఏ భాషలోనైనా ఆదరణ లభిస్తుందని అనేక చిత్రాలు నిరూపించాయి. అయితే కొందరు దర్శకులు మాత్రం కంటెంట్ మీద కేర్ తీసుకోకుండా.. బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు రూపొందిస్తూ బొక్కబోర్లా పడుతున్నారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'లైగర్' సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ తో హడావిడి చేసిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అసలు పూరీ ఇలాంటి పేలవమైన కంటెంట్ తో పాన్ ఇండియాని ఎలా మెప్పించాలని అనుకున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు.
పూరీ కెరీర్ లో వీక్ రైటింగ్ గా 'లైగర్' ని చెప్పొచ్చని ఆడియన్స్ తేల్చేశారు. కేవలం బాలీవుడ్ జనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తీసి, తెలుగు ప్రేక్షకులకు అందించినట్లుగా ఉందని కామెంట్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా బాలీవుడ్ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయడం వల్లనే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయని తెలుస్తోంది.
'లైగర్' సినిమాలో హీరోయిన్ అనన్య పాండే ని బిగ్ మైనస్ గా విమర్శకులు పేర్కొంటున్నారు. అలానే బాలీవుడ్ ట్రెండ్ కు తగ్గట్టుగా అర డజను మంది సంగీత దర్శకులతో వర్క్ చేయించుకోవడం వల్ల జనాలకు మ్యూజిక్ ఎక్కలేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. నార్త్ మార్కెట్ కోసం బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ తో కలవడంలో తప్పు లేదు కానీ.. బీటౌన్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అదనపు హంగులతో సినిమా చేయడమే కరెక్ట్ కాదని అంటున్నారు.
తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్స్ - ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్. తన సినిమాలతో ఎందరో హీరోలను స్టార్స్ ని చేసాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన పూరీ.. హిందీలో గతంలో 'బుడ్డా హోగా తెరే బాప్' అనే సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు 'లైగర్' మూవీతో మరోసారి బాలీవుడ్ ను టార్గెట్ చేసాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.
నిజానికి ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నాయి. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా.. విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల స్పూర్తితో తీసిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలు అన్ని భాషల్లోనూ హిట్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకుల కోసం తీసిన 'కార్తికేయ 2' మూవీ ఇప్పుడు నార్త్ లో భారీ వసూళ్లను రాబడుతోంది.
దీన్ని బట్టి బాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా సినిమాలు చేస్తే సక్సెస్ రాదని.. మంచి కంటెంట్ తో తీసిన తెలుగు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా విజయం లభిస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ విషయాన్ని గ్రహించని కొందరు దర్శకులు మాత్రం బాలీవుడ్ మోజులో టాలీవుడ్ లో కూడా క్రేజ్ పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు.