ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ షోకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చి తన ‘గీతాగోవిందం’ మూవీ ప్రమోషన్ ను నిర్వహించాడు. ఈ సందర్భంగా విజయ్ వేసుకొచ్చిన ‘రౌడీ’ అని రాసి ఉన్న టీషర్టు తనకు బాగా నచ్చిందని.. దాన్ని తనకు ఇచ్చేయాలని బిగ్ బాస్ కంటెస్టెంట్ అమిత్ తివారీ కోరాడు. మీ రౌడీ అటిట్యూడ్ తనకు బాగా నచ్చుతుందని ఈ విలన్ వేషధారి చెప్పుకొచ్చాడు..
నిజమే అర్జున్ రెడ్డిలో రౌడీ విద్యార్థిగా యాంగ్రీ యంగ్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ సృష్టించిన క్యారెక్టరైజేషన్ ను టాలీవుడ్ ఎప్పటికీ మరిచిపోదు. అప్పట్లో టాలీవుడ్ లో శివ సినిమా ట్రెండ్ సెట్టర్ అయితే.. ఇప్పట్లో ‘అర్జున్ రెడ్డి’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్.. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత పూర్తిగా రౌడీ హీరోగానే ప్రవర్తిస్తున్నాడు. అతడి ప్రవర్తన, వేషధారణ మొత్తం అలాగే ఉండిపోతోంది. ఇదే విషయాన్ని తాజాగా విజయ్ కూడా అంగీకరించాడు. రౌడీ గెటప్ నుంచి బయటపడడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు.
‘‘అర్జున్ రెడ్డి సినిమా అయిపోయిన కొన్ని రోజులకే కొత్త సినిమా ‘టాక్సీవాలా’ మొదలుపెట్టాను.సెట్స్ పైకి వచ్చిన మొదటి వారం రోజులు అర్జున్ రెడ్డి పాత్రలాగే వ్యవహరించా.. ఆ ఎఫెక్ట్ పోయేది కాదు.. బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ మొత్తం అర్జున్ రెడ్డిలాగే ఉందని ఆ పాత్ర నుంచి బయటకు రావాలని టాక్సీవాలా డైరెక్టర్ చెప్పాడు. కాస్త తగ్గాలని, కోపం తగ్గించుకోవాలని సూచించాడు. వారం రోజుల తర్వాత తాను మాములు మనిషిని అయ్యాను. షూటింగ్ లో నాలాగా ప్రవర్తించానని’ విజయ్ పాత ఎఫెక్ట్ ను చెప్పుకొచ్చాడు.
కానీ గీతాగోవిందం మూవీలోని పాత్రకు పరకాయ ప్రవేశం చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే పట్టిందని విజయ్ దేవరకొండ వివరించాడు. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ తనపై బలంగా నాటుకుపోయిందని తెలిపాడు. ఇప్పుడు మాత్రం గీతాగోవిందం చేశాక ఏపాత్రనైనా చేయగలననే ధైర్యం వచ్చిందన్నారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగతో మరో సినిమా కూడా చేస్తానని హామీ ఇచ్చాడు.