స్టార్డమ్ ఉన్న హీరోలు ఏదీ మాట్లాడినా ఈ రోజుల్లో ఒక సెన్సేషన్ అవుతోంది. అందుకే వారు మాట్లాడే ప్రతిమాట చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. ఏదైనా ఒక విషయం పై స్పందించినపుడు పాజిటివ్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వినబడతాయి. దీంతో చాలామంది హీరోలు ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఉంటారు. అటువంటి వారిలో మహేష్ బాబు ఒకరు.
టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఈ హీరో ఎక్కువగా వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. సినిమాలు -కుటుంబం తప్ప ఎక్కువగా ఇతర విషయాల్లో జోక్యం చేసుకోరు. సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా తక్కువగా స్పందిస్తారు. ముఖ్యంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఏడేళ్లవుతున్నా ఇప్పటివరకు కేవలం 1132 ట్వీట్లు మాత్రమే చేశాడు. దీన్ని బట్టి చూస్తే మహేష్ సోషల్ మీడియాలో ఎంత స్లోగా ఉన్నడో అర్థం చేసుకోవచ్చు. అయితే సాధారణంగా మహేష్ ఇతర చిత్రలపై ఎక్కువగా స్పందించరు కానీ రీసెంట్ గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న అర్జున్ రెడ్డి సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయితే బోల్డ్ కంటెంట్ లో మంచి లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల కు నచ్చినా కొందరు ప్రముఖులు మాత్రం అర్థం కాక విమర్శలు చేస్తున్నారు.
అంతే కాకుండా సినిమా బావుంది అని స్పందించిన వారిపై కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో చాలామంది హీరోలు ఈ సినిమా నచ్చిన చెప్పకుండా ఎందుకులే అని సైలెంట్ గా ఉన్నారు కానీ మహేష్ సినిమాకు ఫ్లాట్ అయ్యి బావుందని కామెంట్ చేయడంతో కొంతమంది మహేష్ ను టార్గెట్ చేశారు. ఫిదా సినిమా కూడా చాలా బావుంది ఆ సినిమాను పొగడకుండా బోల్డ్ సినిమా అయిన అర్జున్ రెడ్డిని పొగడడం ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కొంచెం స్పీడ్ అవుతున్న మహేష్ ఇక ఇలాంటి వివాదాలు చెలరేగుతున్నాయంటే రానున్న రోజుల్లో ఏ విషయమైన ఓ సారి ఆలోచించి స్పందించాల్సిందే.