టాలీవుడ్ లో మరో వారసుడి రంగప్రవేశానికి రంగం సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొడుకయిన అశోక్ గల్లా హీరోను చేయడానికి ఫైనల్ గా స్టోరీ రెడీ అయింది. అశోక్ హీరోగా తీసే సినిమా సబ్జెక్టుపై చాలా రోజులుగా మహేష్.. జయదేవ్ లు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఓ ఫారిన్ సినిమా స్టోరీని ఓకే చేశారని తెలుస్తోంది.
ఓ అమ్మాయి.. అబ్బాయి మధ్య కాకతాళీయంగా జరిగే కొన్ని సన్నివేశాలు వారిని ఎలా దగ్గర చేశాయనే కాన్సెప్ట్ తో టర్కిష్ భాషలో వచ్చిన మూవీ స్టోరీ ఈ చిత్ర యూనిట్ కు బాగా నచ్చింది. కాస్త ఈ సినిమా స్టోరీ కూడా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుందని.. కొంత మార్పులు చేర్పులు చేస్తే ఇక్కడకు వాళ్లకు నచ్చే అవకాశం ఉందని దర్శక నిర్మాతల ఫీలవుతున్నారని తెలుస్తోంది. అశోక్ గల్లాకు ఈ రోల్ ఫర్ ఫెక్ట్ గా సూటవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆ టర్కిష్ మూవీ రీమేక్ రైట్స్ కూడా తీసేసుకున్నారని తెలిసింది.
ఆడు మగాడ్రా బుజ్జీ ఫేం డైరెక్టర్ కృష్ణారెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. సినిమా యూనిట్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలెట్టేసింది. దిల్ రాజు ఈ సినిమా నిర్మించబోతున్నాడు. వచ్చేనెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇంతవరకు రీమేక్ చేయడానికి పక్కనున్న కోలీవుడ్.. బాలీవుడ్.. శాండిల్ వుడ్ వంటి ఇరుగుపొరుగు ఇండస్ట్రీల వైపు చూడటం మన దర్శక - నిర్మాతలకు అలవాటే. కానీ ఈమధ్య ఫారిన్ సినిమాల్లోనూ వెతుకుతున్నట్టున్నారు.