ఓంకార్ త‌మ్ముడు మళ్లీ కొడతాడా?

Update: 2015-12-10 04:45 GMT
జీనియ‌స్.. అంటూ చిన్నికృష్ణ‌తో క‌లిసి చేసిన  తొలి ఎటెంప్ట్ ఫ్లాపైంది. కాస్ట్ ఫెయిల్యూర్ వ‌ల్ల వ‌చ్చిన ముప్పు అర్థ‌మైంద‌ని చెప్పాడు ఓంకార్‌. అందుకే ప‌రిమిత బ‌డ్జెట్‌ లో 'రాజుగారి గ‌ది' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించ‌గ‌లిగాడు. ఈ సినిమాతో త‌న త‌మ్ముడు అశ్విన్‌ కి హీరోగా అవ‌కాశం ద‌క్కింది.

తొలి సినిమా ఇచ్చిన స‌క్సెస్ కిక్కులోనే మ‌రో సినిమాలో హీరోగా న‌టించేశాడు అశ్విన్‌. ఓంకార్ నిర్మించిన `రాజుగారి గ‌ది` చిత్రాన్ని చివ‌రి నిమిషంలో టేకోవ‌ర్ చేసిన‌ వారాహి చల‌న చిత్రం మ‌రోసారి సేమ్ ప్రాసెస్‌ లో అశ్విన్ సినిమాని రిలీజ్ చేస్తోంది. న‌రేష్ రావూరి నిర్మించిన ఈ సినిమా టైటిల్ `జ‌త క‌లిసే`.తేజ‌స్వి ఈ చిత్రంలో క‌థానాయిక‌. రాకేష్ శ‌శి అనే కొత్త కుర్రాడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.  అన్న‌వ‌రం - రాజ‌మండ్రి - రంప చోడ‌వ‌రం - విశాఖ‌ప‌ట్నం - హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈనెల 25న రిలీజ్ చేయ‌నున్న ఈ చిత్రంలోని పాట‌ల్ని త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

ఓంకార్ త‌మ్ముడు ప‌య‌నం బావుంది. రెండో ప్ర‌య‌త్నమే ఓ రోడ్ ట్రిప్‌ కి సంబంధించిన సినిమాలో న‌టించాడు.  తేజస్వితో క‌లిసి రొమాన్స్ బాగానే సాగించాడు.  రెండో సారి హిట్టు కొట్టి త‌న స‌త్తా ఏంటో చాటుకుంటాడేమో చూడాలి. అన్న‌గారి అండ‌దండ‌ల‌తో త‌మ్ముడు హీరోగా రాణిస్తున్నాడు. మ‌రి లైఫ్ జ‌ర్నీలో ఎంత‌వ‌ర‌కూ ముందుకెళ‌తాడు? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News