రాజ‌మౌళి ఆ స్టెప్ 50 సార్లు చూశాడ‌ట‌

Update: 2015-12-18 13:02 GMT
త‌న‌కు స‌న్నిహితులైన వ్య‌క్తులు సినిమాలు తీస్తే వాటి ఆడియో ఫంక్ష‌న్ల‌కు వ‌చ్చి స‌పోర్ట్ ఇస్తుంటాడు రాజ‌మౌళి. ఈ మ‌ధ్య అలాగే సాయి కొర్ర‌పాటి బేన‌ర్ లో రాబోతున్న జ‌త క‌లిసే ఆడియో ఫంక్ష‌న్ కు విచ్చేశాడు జ‌క్క‌న్న‌. అక్క‌డికొచ్చి ఈ సినిమా హీరో అశ్విన్ మీద ప్ర‌శంస‌లు కూడా కురిపించాడు. రాజు గారి గ‌ది సినిమాలో అత‌ను వేసిన స్టెప్పు గురించి కూడా చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. రాజ‌మౌళి కాంప్లిమెంట్ జీవితాంతం మ‌రిచిపోలేన‌ని.. త‌న పెర్ఫామెన్స్ గురించి.. డ్యాన్స్ గురించి వ్య‌క్తిగ‌తంగానూ జ‌క్క‌న్న అభినందించాడ‌ని చెబుతున్నాడు అశ్విన్‌.

‘‘జత కలిసే ఆడియోకి రాజ‌మౌళి రావడమే గ్రేట్.. ఆయన నాకు ఆల్ ది బెస్ట్ చెబితే చాలు అనుకున్నా కానీ ఆయన రాజుగారి గది సినిమాలో నేను వేసిన స్టెప్ గురించి కూడా మాట్లాడాడు. మ‌ళ్లీ వ్య‌క్తిగ‌తంగానూ దాని గురించి ప్ర‌స్తావించాడు యూ ట్యూబ్ లో మాత్రం ఇప్పటికి 50 సార్లకి పైనే ఆ స్టెప్ చూశానని అన్నారు. ఆ కాంప్లిమెంట్ విన్నాక నా లైఫ్ కి ఇది చాలు అనిపించింది‘‘ అన్నాడు అశ్విన్‌.

ఇక త‌న అన్న‌య్య ఓంకార్ గురించి అశ్విన్ చెబుతూ.. ‘‘హీరో అవ్వాలనేది నా కల..  నా క‌ల నెర‌వేర‌డానికి కారణం అన్నయ్యే.. ఆయన లేకపోతే నేను లేను. జ‌త క‌లిసే కథని కూడా మొదట ఆయనే విని న‌న్ను చేయ‌మ‌న్నారు. త‌నే దగ్గరుండి ఈ సినిమా ప్రొడక్షన్ మొత్తం చూసుకున్నారు. అలా అని డైరెక్షన్ లో వేలు పెట్టలేదు, ఆ విషయంలో ద‌ర్శ‌కుడికి పూర్తి స్వేచ్ఛ‌ ఇచ్చారు‘‘ అన్నాడు.
Tags:    

Similar News