ధనుష్ కథానాయకుడిగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ `అసురన్` తెలుగు రీమేక్ హక్కుల్ని అగ్రనిర్మాత సురేష్ బాబు దక్కించుకున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా ఆ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం సురేష్ బాబు దర్శకుడి ఎంపికలో బిజీ. అసురన్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగే దర్శకుడు కోసం అన్వేషిస్తున్నారట. ఇప్పటికే రాజుగారి గది ఫేం ఓంకార్ పేరు వినిపించింది. కానీ యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో అది గాలి వార్తేననిన తేలిపోయింది. వాస్తవానికి మాతృక దర్శకుడు వేట్రిమారన్ ని రంగంలోకి దింపాలని చూసారు.
కానీ అతడు రీమేక్ పై ఆసక్తి చూపించలేదు. దీంతో సురేష్ బాబు కొత్త దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. తాజాగా సురేష్ బాబు ఓ 20 మంది దర్శకులను లైన్ లో పెట్టినట్లు తెలిసింది. అందులో ఒకరిని దర్శకుడిగా ఎంపిక చేసుకోవాలన్నది ఆయన ప్లాన్ . ఇందులో భాగంగా తనకు బాగా తెలిసిన ఫార్ములానే అప్లై చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే అసురన్ ఒరిజినల్ వెర్షన్ ని రామా నాయుడు ప్రివ్యూ థియేటర్ లో వేసి ఆ 20 మందికి చూపించాడుట. సినిమా పై ఎవరి ఒపినియన్ ని వారు సురేష్ బాబు తో షేర్ చేసుకున్నారు.
ఇందులో కొంత మంది దర్శకులు తమ వల్ల కాదని చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. మరికొంత మంది రీమేక్ చేస్తే ఫీల్ రాదని.. ఇంకొందరు పూర్తిగా అనాసక్తి ని కనబరిచార ని సమాచారం. మరికొంత మంది సినిమాపై కేవలం తమ ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకున్నారు. కానీ ఆ సమయంలో ఏ దర్శకుడు నేను చేయగలనని ధైర్యంగా ముందుకు రాలేదట. చూద్దాం.. మరి అసురన్ కోసం ముందుకొచ్చేది ఎవరో చూడాలి. ప్రస్తుతం సురేష్ బాబు బాలీవుడ్ సినిమాలు డ్రీమ్ గాళ్ .. సోనీ కి టిటూ కీ స్వీటీ లాంటి బ్లాక్ బస్టర్లను రీమేక్ చేసే పనిలో ఉన్నారు. ఈ బిజీలో తలమునకలుగా ఉన్న ఆయన అసురన్ రీమేక్ కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారట.