కాలం కలిసొస్తే అదృష్టం తన్నుకు వస్తుందంటారు. ఇదిగో ఇప్పుడు ఉన్నట్టుండి సడెన్ గా మెగా కాంపౌండ్ లో ఆఫర్ అందుకుని ఊహించని షాకిచ్చింది అవికా గోర్. ఈ బుల్లితెర బాలనటి టీనేజీలో అడుగు పెట్టగానే అనూహ్యంగా ఉయ్యాల జంపాల చిత్రంతో కథానాయిక అయ్యింది. రాజ్ తరుణ్ సరసన చక్కని ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంది. ఆరంగేట్రమే తనదైన అందం నటనతో అదరగొట్టింది. మత్తెక్కించే చూపులతో కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిచ్చింది. తొలి ప్రయత్నమే విజయం అందుకుంది.
ఆ తర్వాత ఎడా పెడా కొన్ని ఆఫర్లు తన వెంటపడినవి ఓకే చేసేయడంలో తప్పడడుగులు వేసింది. పీఏలు మేనేజర్ల కోసం.. లేదా మొహమాటానికి నటించినవి అవికాకు అస్సలు కలిసి ఆలేదు. అవన్నీ ఫ్లాపులవ్వడంతో కెరీర్ పరంగా పూర్తిగా డైలమాలో పడిపోయింది. కెరీర్ డైలమాలో పడిన క్రమంలోనే తనపైన కొందరు కుట్ర చేశారని దుష్ప్రచారం చేసి అవకాశాల్ని అడ్డుకున్నారని కూడా ఆరోపించడం వేడెక్కించింది.
అదంతా గతం అనుకుంటే వర్తమానంలో అవిక వేరు. ఈ భామ ఇటీవల ఊహించని సర్ ప్రైజ్ చేస్తూ బొద్దుతనాన్ని పూర్తిగా తగ్గించేసుకుంది. ఇప్పుడు స్లిమ్మింగ్ బ్యూటీగా మారి సరికొత్త ట్రీటిచ్చేందుకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవ్వర్ లేటెస్టు సమాచారం ప్రకారం.. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఈ భామ క్రేజీగా అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని అవిక స్వయంగా ఇన్ స్టాలో ధృవీకరించింది.
శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఏఏఏ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూట్ ప్రారంభమైందని వెల్లడించింది. అదృష్టం తనని వెతుక్కుంటూ వచ్చింది. కనీసం ఈసారైనా సరిగా సద్వినియోగం చేసుకుని వరుసగా అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి. పాత తప్పుల్ని రిపీట్ చేయకపోతే మరోసారి అవికాగోర్ షైన్ అయ్యేందుకు ఆస్కారం ఉంది.