టాలీవుడ్‌లో వైభవం చూసిన నిన్నటితరం దర్శకుల్లో బి.గోపాల్ ఒకడు. ప్రతిఘటన మొదలుకుని నరసింహనాయుడు వరకు ఎన్నో బ్లాక్‌బస్టర్లు చూశారాయన. తన తరం సీనియర్ దర్శకులందరూ డౌన్ అయిపోయిన టైంలో సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు చిత్రాలతో తిరుగులేని విజయాలందుకున్నారాయన. కానీ ఫ్యాక్షన్ సినిమాలతో కొత్త ఒరవడి సృష్టించిన ఆయనే.. ఆ తరహా సినిమాల నుంచి బయటికి రాలేక, ట్రెండ్‌కు తగ్గట్లు మారలేక రేసులో వెనకబడిపోయాడు. వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయారు. మస్కా తర్వాత నందమూరి బాలకృష్ణతో అనుకున్న సినిమా ఒకటి ఆగిపోయింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా ఆరడుగుల బుల్లెట్ సినిమా మొదలుపెడితే అనేక కారణాలతో అది చాలా ఆలస్యం అయింది.
మొదలుపెట్టిన ఏడేళ్లకు ఇప్పుడు ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో బి.గోపాల్ మీడియాను కలిశారు. గోపాల్ ప్రైమ్ టైంలో ఉన్నపుడే మీడియాను కలవడం తక్కువ. ఇక సినిమాలు లేకపోవడంతో పూర్తిగా మీడియాకు దూరం అయ్యారు. సినిమా వేడుకల్లోనూ కనిపించడం మానేశారు. ఎట్టకేలకు ఆయన మీడియా ముందుకు రావడం ఆయన అభిమానులకు ఆనందాన్నిచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరడుగుల బుల్లెట్ గోపీచంద్‌కు సరిగ్గా సరిపోయే కథ అని.. ఇదొక మంచి యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఎంటర్టైనర్ అని అన్నారు.
ఆరడుగుల బుల్లెట్ తర్వాత బాలయ్యతో ఓ సినిమా చేయడానికి చాలా ప్రయత్నించానని.. కానీ కథ కుదరకపోవడంతో సినిమా పట్టాలెక్కలేదని.. బాలయ్యతో మళ్లీ ఓ సమరసింహారెడ్డి లాంటి సినిమా తీయాలనుందని.. కథ కుదిరితే కచ్చితంగా బాలయ్యతో సినిమా చేస్తానని ఆయనన్నారు.