బాహుబలి 2.. రికార్డ్ ఓపెనింగ్స్

Update: 2018-05-05 06:21 GMT

టాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ టాలెంట్ ఏంటో దేశమంతా తెలిసింది. బాహుబలి 1 అండ్ 2 చిత్రాలు అందించిన రికార్డులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అలా నిలిచిపోతాయని చెప్పాలి. అయితే బాహుబలి క్రేజ్ ఇప్పుడు పరదేశనికి కూడా పాకింది. ఎక్కువ సినిమా మార్కెట్ ఉన్న చైనాలో సినిమా కు మొదటి నుంచి మంచి క్రేజ్ అందుతోంది.

ఎమోషన్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను అమితంగా ఇష్టపడే చైనీయుల కోసం బాలీవుడ్ నిర్మాతలు బాహుబలి సెకండ్ పార్ట్ ని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. దాదాపు 7000 స్క్రీన్స్ లలో సినిమాను రిలీజ్ చేసి భారీ టార్గెట్ పై కన్నేయగా.. మొదటి రోజు ఊహించని విధంగా కలెక్షన్స్ ని అందుకుంది. ఓపెనింగ్ డే లో ఆల్ టైమ్ ఇండియన్ సినిమాల్లో టాప్ 3 లో నిలిచింది. దీంతో ఇంకా భారీ వసూళ్లు అందుతాయనే టాక్ వస్తోంది.

సీక్రెట్ సూపర్ స్టార్ మరియు హిందీ మీడియమ్  వరుసగా ¥ 43.67 M మరియు 21.27 M వసూళ్లు రాబట్టి చైనాలో మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఇండియన్ సినిమాలుగా నిలిచాయి. ¥ 15.77 మిలియన్ల కలెక్షన్స్ తో బాహుబలి 2 చైనాలో  మూడవ స్థానంలో నిలిచింది. ఇండియన్ సినిమాల్లో దంగాల్ చైనా వారిని ఎక్కువగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఇండియన్ సినిమాలకు అక్కడ ఆదరణ పెరుగుతోంది. మన ఎమోషన్స్ కి అక్కడి వారు ఎంతగా కనెక్ట్ అవుతున్నారో చెప్పవచ్చు.
Tags:    

Similar News