ఏమైనా కొన్ని విషయాలు చెప్పడం చాలా తేలిక.. అదే విషయం పాటించాల్సి వచ్చేసరికి తేడా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడెప్పుడో మగధీర 100 డేస్ సెంటర్స్ విషయంలో ఏదో జరిగిందంటూ.. కొన్ని రోజుల క్రితం దర్శకధీరుడు రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ కు తనకు మధ్య కాసింత తేడా రావడానికి ఆ సెంటర్ల లెక్కే కారణమన్నాడు జక్కన్న.
9 ఏళ్ల క్రితం జరిగితే ఇప్పుడెందుకు చెప్పాడని మనం అడక్కూడదు. ఎందుకంటే.. మగధీర తర్వాత మళ్లీ అంతటి హిట్ రాజమౌళి ఖాతాలో పడింది ఇప్పుడే(బాహుబలి 1 & 2) కాబట్టి.. ఇప్పుడు మాట్లాడడని అర్ధం చేసుకోవచ్చు. అది సరే కానీ.. ఇప్పుడు 1050 సెంటర్లలో(ఇండియాలో) బాహుబలి2 50 డేస్ అంటూ పోస్టర్లు వేశారు. బాహుబలి ది కంక్లూజన్.. ఇండియాలో బిగ్గెస్ట్ అనడంలో సందేహం అక్కర్లేదు కానీ.. మరి ఈ సెంటర్ల లెక్క చెప్పాల్సిన అవసరమేంటని సోషల్ మీడియా జనాలు అడుగుతున్నారు.
ఇన్ని సెంటర్లలో మా సినిమా అన్ని రోజులు ఆడిందని చెప్పిన వారంతా.. ఆయా సెంటర్లు-థియేటర్ల పేర్లను కూడా ఇచ్చేవారని.. తాము వాస్తవమే చెబుతున్నామని అనేందుకు ఇది సాక్ష్యం అని గుర్తు చేస్తున్నారు. కానీ బాహుబలి2 విషయంలో యూనిట్ నుంచి అలాంటి ప్రయత్నాలేమీ చేయకపోవడం చూస్తే.. అతి పెద్ద హిట్ కాబట్టి.. తాము చెప్పినదే నిజమని జనాలు నమ్మేస్తారని జక్కన్న అండ్ ఫిక్స్ అయిపోయి ఉంటుందని జోకులు వేసుకుంటున్నారు. మరి ఈ కామెంట్స్ కు బాహుబలి యూనిట్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/