బాహుబలి బడ్జెట్ రూ.220 కోట్లని నిర్మాత శోభు యార్లగడ్డ చెబితే చాలామందికి నమ్మకం కలగలేదు. కానీ ఇప్పుడు సినిమా విశేషాలు తెలుసుకుంటుంటే ఆ బడ్జెట్ మరీ ఎక్కువేమీ కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా రూ.70 కోట్లు ఖర్చు అవుతున్నట్లు అంచనా. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న టెక్నీషియన్ శ్రీనివాస్ మోహన్ ఆధ్వర్యంలో బాహుబలి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి.
బాహుబలిలో ఎఫెక్ట్స్ అన్నీ హై క్వాలిటీలో ఉంటాయట. హాలీవుడ్ స్థాయిలో అత్యంత సహజంగా ఉండేలా ఈ ఎఫెక్ట్స్ తీసుకొస్తున్నారట. అందుకే కేవలం పది సెకన్ల విజువల్ ఎఫెక్ట్స్‌కు దాదాపు రూ.50 వేలు ఖర్చవుతున్నట్లు సమాచారం. వివిధ దేశాల్లో 17 విఎఫ్‌ఎక్స్ స్టూడియోల్లో 600 మందికి పైగా సాంకేతిక నిపుణులు రోజుకు రెండు షిఫ్టుల్లో కొన్ని నెలలుగా బాహుబలి సినిమా కోసం పని చేస్తున్నారు. అందుకే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు భారీ బడ్జెట్ అవసరమవుతోంది. రెండు పార్ట్‌లకు కలిపి ఇందుకోసం రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. సినిమాలో 80 శాతం సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఉంటాయని సమాచారం. ఇండియాలో మరే సినిమాకు కూడా గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ కోసం ఇంత శ్రమ, ఇంత ఖర్చు చేసింది లేదని.. ఆ కష్టానికి, ఖర్చుకు ఫలితం తెరమీద కచ్చితంగా కనిపిస్తుందని బాహుబలి యూనిట్ వర్గాలు అంటున్నాయి.