మార్కెటింగ్ టెక్నిక్స్ ఛేదించిన బాహుబలి

Update: 2017-05-10 06:21 GMT
ఒక సినిమా రిలీజ్ అవుతోందంటే.. బోలెడంత ప్రచార హంగామా ఖాయం. పెద్ద సినిమాలకు ఈ హడావిడి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టీవీల్లో కార్యక్రమాలకు టీం అంతా వెళ్లడం.. కామెడీ షోలకు వెళ్లి కుళఅలు జోకులకు నవ్వడం.. డ్యాన్సింగ్ కార్యక్రమాలు.. రియాల్టీ షోలలో పాల్గొనడం వంటివి కామన్ గా జరుగుతున్నాయి.

ఇప్పటివరకూ వీటిని ప్రచార సాధనాలుగా భావించాం. కానీ బాహుబలి2 వీటన్నిటినీ ఛేదించేసింది. ఒక్కటంటే ఒక్క టీవీ కార్యక్రమానికి కూడా బాహుబలి టీంలో ఎవరూ అటెండ్ కాలేదు. తమకు సంబంధించని ఏ ప్రోగ్రామ్ లోను.. ఈవెంట్ లోను కనిపించలేదు. అయినా సరే బాహుబలి ది కంక్లూజన్ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ ను ఈజీగా దాటేసింది. కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోంది కూడా. నిజానికి దంగల్ మూవీని కూడా ఇదే కేటగిరిలోకి చేర్చాలి. ఈ మూవీ కూడా బాహుబలి మాదిరిగానే కేవలం కంటెంట్ ఆధారంగానే ఆడింది. క్వీన్.. కహానీ.. మున్నాభాయ్ సిరీస్ లోని సినిమాలు కూడా విపరీతంగా ఆడేశాయి.

ఇవన్నీ కంటెంట్ తో ఆడినవే తప్ప.. సినిమా ప్రచారంతో ఏ మాత్రం సంబంధం లేదని చెప్పాలి. ఇప్పుడు సాంప్రదాయంగా పాటిస్తున్న ప్రచార సాధనాలు తొలి రోజు కలెక్షన్స్ కు మినహాయిస్తే.. ఆ తర్వాత మూవీ వసూళ్లను సినిమా స్థాయిని నిలబెట్టలేవనే విషయం ఇప్పుడు తేలిపోయింది.

Tags:    

Similar News