బాహుబలికి 100 కోట్ల ఛాన్స్‌ ఇవ్వదేమో

Update: 2015-05-26 08:14 GMT
బాలీవుడ్‌లో పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ కొడుతున్నారు. అక్కడ ఇటీవలి కాలంలో నాయికా ప్రాధాన కథలతో సినిమాలు తెరకెక్కించి 100కోట్ల వసూళ్లు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. సునాయాసంగా ఈ వసూళ్లు వచ్చేస్తున్నాయి. తొలివారంలోనే పెట్టుబడులు లాగేస్తూ భారీగా గ్రాస్‌ వసూలు చేసేస్తున్నాయి అక్కడి సినిమాలు. కాని 2015లో ఇంతవరకు 100 కోట్లు కొట్టిన సినిమా ఏదీ లేదు ఇప్పటివరకు. బట్‌, అన్ని రోజులూ ఒకేలా ఉండవ్‌.

ఇటీవలే కంగన రనౌత్‌ లీడ్‌ రోల్‌ చేసిన 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌'కు మాంచి పేరొచ్చింది. చూస్తుంటే 100కోట్ల గ్రాస్‌ వసూళ్ల ఇండియాలోనే గ్యారంటీ అంటున్నారు ట్రేడ్‌ ఎక్స్‌పర్ట్స్‌. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అంతటా రాజమౌళి బాహుబలి గురించిన చర్చ సాగుతోంది. ఈ సినిమా ప్రపంచమంతా రిలీజవుతోంది.. అయితే తొలిభాగం 100కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరే తొలి 2015 సినిమా అవుతుందని అందరూ ఆకాంక్షిచారు. కాని తనూ వెడ్స్‌ మనూ రిటర్న్స్‌ ఆ సీన్‌ ఇచ్చేలా లేదు. రాజమౌళి ఈ సినిమాని టెక్నికల్‌గా హాలీవుడ్‌ స్టాండార్డ్స్‌లో తెరకెక్కించినా, కంగన యాక్టింగ్‌తో అంతకంటే ఎక్కువగా మెప్పించేస్తోంది. సో, బాహుబలి 2015లో 100 కోట్లు వసూలు చేసే సెకండ్‌ మూవీ అవుతుందేమో కాని, తొలి చిత్రం కాబోదని అంచనా.
Tags:    

Similar News