అమ్మకాల మీదనే బాహుబలి ఫోకస్‌

Update: 2015-05-24 13:30 GMT
ఇకపోతే దేశం కోసం ఒక అద్భుతమైన సినిమా.. ఆడియన్స్‌ కోసం అంతర్జాతీయ సినిమా.. ఇప్పటివరకు ఇండియన్‌ డైరక్టర్‌ ఎవ్వరూ చేయించలేనంత రేంజ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌.. ఇలాంటి పొగడ్తలకు ఏం గాని, పెట్టిన డబ్బులు తిరిగి రావడం అనేది ప్రొడ్యూసర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుండి చాలా ముఖ్యం. సరిగ్గా ఇప్పుడు రెండు భాగాల బాహుబలి నిర్మాతలు దాన్నే తెలుసుకున్నారు. రాజమౌళి చింపేస్తున్నాడు అనేది ఎంతవరకు నిజమో, రిలీజ్‌కు ముందే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌ను రికవర్‌ చేసుకోవాలి అనేది కూడా ముఖ్యమైన బిజినెస్‌ సీక్రెట్టే మరి.

కరెక్టు రేటు తెలియదు కాని బాహుబలి ఆడియో రైట్స్‌ను ఏకంగా 3 కోట్లకు విక్రయించారంటూ రూమర్లు వచ్చేశాయి. ఇక టివి 5 వారు ఈ సినిమా ఆడియో ఈవెంట్‌ టెలీకాస్ట్‌ రైట్స్‌ను 1 కోటికి దక్కించుకున్నారని ఇంకో టాక్‌. తమిళ రిలీజ్‌ రైట్స్‌ను 20 కోట్లకు ఇచ్చారని, హిందీలో రిలీజ్‌ చేస్తున్నందకు కరణ్‌ జోహార్‌ కూడా బాగానే ముట్టజెప్పాడని కూడా తెలుస్తోంది. చూస్తోంటే 100 కోట్లతో తీసిన సినిమాను రిలీజ్‌కు ముందే దాదాపు ఓ 65 కోట్లు ఈజీగా రికవర్‌ చేయించేలా ఉన్నారు. ఇప్పటికే పోస్టర్ల కారణంతో భారీగా క్రేజ్‌ రావడంతో, ఆ క్రేజ్‌ ద్వారా అమ్మకాలు స్పీడందుకున్నాయ్‌. ఇక ట్రైలర్‌ కూడా వచ్చేస్తే బాహుబలి బిజినెస్‌ ఊపందుకుంటుందేమో.
Tags:    

Similar News