పెద్ద తెర.. బుల్లితెర.. డిజిటల్ తెర .. స్క్రీన్ ఏదైనా కానీ అక్కడ అదిరిపోయే ట్రీట్ ఉంటేనే జనం ఎగబడతారు. ఇదే ప్రాథమిక సూత్రం. టీవీ ప్రోగ్రామ్ లేదా సినిమాలో కంటెంట్ ఉంటేనే వీటిని ఆయా వేదికలపై ఆదరిస్తారు. పదిమందిని చూడాల్సిందిగా చెబుతారు. ఇక డిజిటల్ లింకుల్ని అయితే వాట్సాప్ ఫేస్ బుక్ ట్విట్టర్ వంటి చోట్ల షేర్ చేసి తప్పనిసరిగా చూడండి అని ప్రచారం చేసేందుకు వెనకాడరు. విషయం లేని వాటికి ఇంత రిస్క్ చేయలేరు కదా!
మొన్ననే డిజిటల్లో మేమే తొలి రిలీజ్ కి వస్తున్నాం! అంటూ తెలుగులో అమృత రామమ్... తమిళంలో ఆర్.కె.నగర్ .. ఇవి రెండూ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సైట్లలో కి రిలీజైపోయాయి. కానీ ఏం లాభం? అసలు ఇవి వచ్చాయని చూసింది ఎవరు? తెలిసింది ఎందరికి? అసలు ఈ సినిమాల టైటిల్స్ కూడా ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు డిజిటల్ వీక్షణ ఎలా సాధ్యం? ఈ రెండిటిలో కొత్త కుర్రాళ్లే. చెప్పుకోదగ్గ ఫేస్ లేవీ కనిపించలేదు. సినిమాలో కంటెంట్ ఉందా లేదా? అన్న చర్చ కూడా జరగడం లేదు. ఇది వేరొక కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చింది.
డిజిటల్ లో సబ్ స్క్రైబ్ చేసుకోండి .. పేమెంట్ చేయండి! అంటే ఎవరు చేస్తారు. అసలే ఉద్యోగాల్లేక జీతాల్లేక ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న పరిస్థితి. ఇంటి అద్దెలు... ఈఎంఐలు కట్టలేక ఒకటే టెన్షన్. ఇలాంటి టైమ్ లో వినోదం కోసం ఖర్చు చేయగలరా? రూ.200-400 అయినా ఈ కష్టకాలంలో తేవడం కష్టమే. అందుకే డిజిటల్ లో వచ్చినా ఎవరూ చూడలేదు. ఇక పెద్ద స్టార్లు అయితే కొంత వరకూ రిస్క్ చేస్తారేమో! స్వీటీ అనుష్క నటించిన నిశ్శబ్ధం.. నానీ-సుధీర్ ల `వీ` వంటి చిత్రాలకు డిజిటల్ లో ఆదరణ బాగానే ఉండచ్చు. స్టార్ డమ్ ఉంది కాబట్టి వీక్షించే వీలుంటుంది. మరి ఆయా చిత్రాల్ని డిజిటల్లో వదిలేస్తారా? లేక ఇంకా బెట్టు చేస్తారా? అన్నది చూడాలి. ఈ రెండిటి విషయంలో బెట్టు వీడితే అది స్ఫూర్తిగా భావించి ముందుకెళ్లేందుకు ఇంకా చాలామంది క్యూలో ఉన్నారన్న గుసగుసా వినిపిస్తోంది.