ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చాలా మంచి ఉన్నాయి. కానీ ప్రేక్షకులు మాత్రం కనెక్ట్ అయిన సీన్ ఒకటే. మాయబజార్ సినిమా కోసం శ్రీకృష్ణుడు పాత్రకు ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకుంటారు కేవీరెడ్డి. కానీ ఇది నాగిరెడ్డి - చక్రపాణికి నచ్చదు. ఆ సమయంలో.. మేకప్ వేసుకని వస్తున్న ఎన్టీఆర్ ని చూసి నాగిరెడ్డి - చక్రపాణి ఆశ్చర్యపోతారు. దేవుడంటే - కృష్ణుడంటే అచ్చు ఇలాగే ఉంటాడు అనుకుని మాయబజార్ మొదలుపెడతారు. సూపర్ హిట్ కొడతారు.
చెప్పుకుంటూ పోతే ఇది మామూలు సీనే. కానీ ఈ సీన్ కు ముందు ఎస్టాబ్లిష్ మెంట్స్ - పనివాళ్లు కొబ్బరికాయలు కొట్టడం - పైనుంచి రంగులు పడడం - ఆ తర్వాత నాగిరెడ్డి దండం పెట్టడం.. ఇలా అన్నీ ఈ సీన్ ఇంటెన్సిటీ పెంచాయి. దీనికితోడు కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో.. సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి నరాలు ఉప్పొంగుతాయి. ఇదిగో ఇలాంటి సీన్లనే ఆడియన్స్ కోరుకుంటారు. ఇలాంటి సీన్స్ ఫస్టాఫ్ లో రెండు - సెకండాఫ్ లో రెండో మూడో వచ్చి ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ మరో రేంజ్ లో ఉండేది. చివరకు పార్టీ పెట్టాలనుకున్న నిర్ణయంలో ఎన్టీఆర్ పడిన సంఘర్షణను చూపించారు కానీ.. ఆ ఎమోషన్ లో ప్రేక్షకుడ్ని ఇన్ వాల్వ్ చేయలేకపోయారు.
Full View