బాలయ్యకు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్... ?

Update: 2021-10-16 06:17 GMT
బాలక్రిష్ణ సినీ ఇండస్ట్రీలో నటుడిగా  దశాబ్దాలుగా ఉంటున్నారు. సోలో హీరోగా ఆయన గత 37 ఏళ్ళుగా కొనసాగుతున్నారు. బాలయ్య సినిమాలు హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన రెమ్యునరేషన్ ఎపుడూ నిలకడగా ఉంటుంది. అది నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది. అందుకే చాలా మంది నిర్మాతలు ఈ రోజుకీ బాలయ్యతో సినిమాలు తీయడానికి రెడీగా ఉంటారు. బాలయ్య ఒక విధంగా నిర్మాతల హీరో అని చెబుతారు. బాలయ్యతో సరైన కధ ఎంచుకుని మంచి డైరెక్టర్ తో ప్లాన్ చేస్తే కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇది గతంలో ఎన్నో సార్లు రుజువు అయింది. అలా తీసిన నిర్మాతలకు కూడా కనకవర్షం కురిసింది. ఇక బాలయ్యతో తీసిన సినిమా ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలకు పెద్దగా నష్టం రాదు అని చెబుతారు. ఎందుకంటే ఆయన సినిమా బడ్జెట్ ఎపుడూ హద్దులో ఉంటుంది. బాలయ్య సైతం అనవసర ఖర్చులకు ఆడంబరాలకు దూరంగా ఉంటారు.

మొత్తానికి బాలయ్య పారితోషికం విషయంలో ఎపుడూ తనదే పై చేయి అని చూపించుకోలేదు. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య  తొలిసారిగా బిగ్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ కి వస్తున్నారు. అది కూడా డిజిటల్ ఫ్లాట్ ఫారం మీదకు తొలి అడుగు వేశారు. ఇక బాలయ్య ఆహాలో అన్ స్టాబబుల్ అంటూ ఓక టాక్ షో  చేస్తున్న సంగతి విధితమే. ఆహా అంటే అల్లు అరవింద్ ది. ఆయన స్టార్ ప్రొడ్యూసర్. ఆయన చాలా లావిష్ గా సినిమాలు తీస్తారు. ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద  బాలయ్యతో ఎపుడూ సినిమాలు తీయలేదు కానీ తీస్తే ఆయన ఇచ్చే రెమ్యునరేషన్ ఎలా ఉండేదో. అదంతా ఎందుకంటే ఇపుడు ఆహా కు టాక్ షో చేస్తున్న బాలయ్యకు అల్లు అరవింద్ ఇచ్చే పారితోషికం కళ్ళు చెదిరేలా ఉంది అంటున్నారు.


ఏకంగా ఎపిసోడ్ కి నలభై లక్షలు పారితోషికంగా ఇస్తున్నారుట. మొత్తం పన్నెండు ఎపిసోడ్స్ గా దీన్ని డిజైన్ చేస్తున్నారు. అంటే మొత్తంగా అయిదు కోట్ల దాకా బాలయ్యకు రెమ్యునరేషన్ దక్కుతుంది అని లెక్కలు వేస్తున్నారు. నిజంగా బాలయ్యకి ఇది ఒక సినిమా రెమ్యునరేషన్ లాగానే ఉంది. అయితే ఒక సినిమా చేయాలి అంటే కచ్చితంగా ఆరు నెలల నుంచి ఏడాది కాలం పడుతుంది. అదే ఆహా టాక్ షో అయితే మూడు నెలల్లో ముగుస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే బాలయ్యతో సినిమా అల్లు అరవింద్ తీస్తే కచ్చితంగా ఇరవై కోట్ల పారితోషికమే ఆయనకు ఇస్తున్నట్లు లెక్క.  బాలయ్య ఇప్పటిదాకా ఏ సినిమాకు అయిదారు కోట్లకు మించి పారితోషికం తీసుకోలేదు. మరి ఆహా టాక్ షోకు అతి తక్కువ టైమ్ లో ఇత రెమ్యునరేషన్ బాలయ్యకు లభిస్తోంది అంటే నిజంగా గ్రేటే. ఈ దెబ్బతో మూవీస్ లో కూడా బాలయ్య రెమ్యునరేషన్ పెంచుతారా అన్నదే డౌట్. అన్నట్లు అఖండ మూవీ కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాలయ్య కచ్చితంగా పది కోట్లు పై దాటి తీసుకుంటాడు అన్న ప్రచారం కూడా ఉంది మరి.
Tags:    

Similar News