నటసింహా నందమూరి బాలకృష్ణ స్పీచ్ ల గురించి చెప్పాల్సిన పనేలేదు. వేదికలెక్కితే అంతేగా అంతేగా! అంటూ అభిమానుల్లో కోలాహాలం షురూ అయినట్టే. ఆయన గళం విప్పితే అహూతులు ప్రత్యేకించి దాని గురించే మాట్లాడాలి. ఆయన స్పీచ్ లో `తెలుగు` గురించి `సంస్కృతి` గురించి ఎక్కువ వినిపిస్తుంటుంది. కానీ ఈసారి అవి రెండూ మిస్సవ్వడం.. అలాగే 189 అనే అంకె పదే పదే ఆయన నోట్లో నానడంపై నందమూరి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగింది.
అంతగా ఆయన్ని కలవరపెట్టిన ఆ సంఖ్య వెనక కథేమి? అంటే.. బాలయ్య ఎగ్జయిట్ మెంట్ లో చేసిన ఓ తప్పిదం అదని తేలింది. 118 టైటిల్ ని 189 అనేస్తూ పదే పదే దంచేయడం పై ఆసక్తిగా చర్చ సాగింది. కళ్యాణ్ రామ్ - నివేత థామస్- షాలిని పాండే తారాగణంగా నటించిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్ నేటి సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీలో ఘనంగా జరిగింది. ఈ వేడుక లైవ్ లో బాలయ్య మాట్లాడుతూ 118 టైటిల్ ని కాస్తా 189 గా మార్చి మాట్లాడారు. పదే పదే అదే తీరుగా 189 అంకెనే చెప్పడంతో గ్యాలరీలో ఆడియెన్ మాత్రం చాలానే కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే అది స్పీచ్ లో జరిగిన తప్పిదం మాత్రమే. అయితే ఈ స్పీచ్ పై అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్లు మాత్రం ఓ రేంజులో పడిపోతున్నాయ్.
బాలకృష్ణ స్వతహాగానే ఎమోషనల్. వేదికలు ఎక్కితే అదుపు తప్పి ఎంతో ఎగ్జయిటింగ్ గా మాట్లాడేస్తారు. అందువల్ల జరిగిన పొరపాటు అది. దానిని సరి చేస్తూ చెవిలో ఏదో చెప్పబోయిన కళ్యాణ్ రామ్ ని సైతం బాలయ్య పెద్దగా వేదికపై పట్టించుకోలేదు. ఆయన తనదైన బాణీలోనే 189 అంటూ క్లోజింగ్ టచ్ ఇవ్వడంపైనా ఆసక్తిగా చర్చ సాగింది. ఈ వేదికపై అన్నదమ్ములు కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ఈ వేదికకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.