బాలకృష్ణ స్టైల్ వేరు .. ఆయన రూట్ వేరు. తన సినిమా ఏదో ఒకటి సెట్ పై ఉండవలసిందే. అందువల్లనే ఒక సినిమా పూర్తవుతూ ఉండగానే ఆయన మరో సినిమాను లైన్లో పెడుతూ ఉంటారు. అలాగే బోయపాటితో రీసెంట్ గా ఆయన 'అఖండ' సిసినిమాను పూర్తిచేశారు.
ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, గోపీచంద్ మలినేని సినిమాను బాలకృష్ణ లైన్లో పెట్టేశారు.
వినాయక్ .. బోయపాటి .. హరీశ్ శంకర్ తరువాత మాస్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో గోపీచంద్ మలినేని సిద్ధహస్తుడు. రవితేజ హీరోగా ఈ ఏడాది ఆరంభంలో ఆయన నుంచి వచ్చిన 'క్రాక్' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది.
గోపీచంద్ మలినేనిని స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేర్చేసింది. ఆ సినిమాను చూసిన బాలయ్య వెంటనే గోపీచంద్ మలినేనిని అభినందించడమే కాకుండా తన సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ఆ సినిమాకి సంబధించిన పనుల్లోనే గోపీచంద్ మలినేని ఉన్నాడు.
ఈ సినిమా కథ కొంత రాయలసీమ నేపథ్యంలో సాగుతుందనే టాక్ ఆ మధ్య బయటికి వచ్చింది. ఇక మిగతా కథ అమెరికా నేపథ్యంలో నడుస్తుందనే వార్త తాజాగా వినిపిస్తోంది. సాధారణంగా బాలకృష్ణ కథలు ఇక్కడే పుట్టిపెరుగుతూ ఉంటాయి. తన సినిమాల్లో పాటలు మాత్రమే విదేశాల్లో చిత్రీకరిస్తూ ఉంటారు.
అలాంటిది ఈ సారి అమెరికాలో కొంత కథ కూడా నడిచే సినిమాలో బాలయ్య చేయనున్నాడు. ఆయన పాత్రలో రెండు రకాల వేరియేషన్స్ ఉంటాయట. ఆ వేరియేషన్స్ ను గోపీచంద్ మలినేని డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమా, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ నటించనుంది. ఆ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించింది. తమన్ సంగీతాన్ని సమకూర్చనున్న ఈ సినిమాకి, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు.
యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా గోపీచంద్ మలినేని చెప్పడంతో, అభిమానుల్లో ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాను వచ్చే దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.