ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న `ఆదిపురుష్ 3డి`లో విలన్ గా నటించనున్నారు సైఫ్ అలీఖాన్. తానాజీ ఫేం ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సైఫ్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. అతడు నటించిన తాండవ్ వెబ్ సిరీస్ వివాదాస్పదం అయ్యింది.
హిందూ దేవుళ్లను కించపరుస్తూ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఈ సిరీస్ లో కొన్ని సన్నివేశాలున్నాయని.. హిందూ దేవుళ్ళను ఎగతాళి చేస్తూ దారుణంగా చూపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని దృశ్యాలు అభ్యంతరకరంగా.. నీచంగా ఉన్నాయి! అంటూ పలువురు సోషల్ మీడియాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఉత్తరాదిన దీనిపై గడబిడ మొదలైంది. కొందరు రాజకీయ నాయకులు తాండవ్ లోని సన్నివేశాలపై తమ అసమ్మతిని వ్యక్తం చేశారు. రాముడు.. శివుడి భక్తుల మనోభావాల్ని కించపరిచే సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి సైఫ్ నటించిన తాండవ్ కి అన్నీ నెగెటివ్ సమీక్షలే వచ్చాయి. దీంతో మేకర్స్ కావాలనే ఇలా వివాదాల్ని తెరపైకి తెస్తున్నారన్నది ఒక సెక్షన్ వాదన. కావాలని వివాదాలు సృష్టించి క్రేజు పెంచే చెత్త ట్రిక్కులు ప్లే చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంపాదన కోసం చిత్రనిర్మాతలకు హిందూ సమాజం సాఫ్ట్ టార్గెట్ గా మారిందని ఒక వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కంటెంట్ కంటే వివాదాలతోనే ఈ సిరీస్ పై ఆసక్తిని పెంచడం సరైనది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఉద్దేశపూర్వక వివాదం అన్న వాదన వినిపిస్తోంది. తాండవ్ వెబ్ సిరీస్ ను నిషేధించాలన్న గొడవ ఇప్పుడు సర్వత్రా వేడెక్కిస్తోంది. #బాన్ తాండవ్ నవ్ హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది.